ఎక్కువసేపు కూర్చుని పని చేస్తే ప్రాణానికి చాలా ప్రమాదం....

మన పూర్వీకుల కాలంలో ప్రపంచంలోని చాలామంది ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు.ఆ కాలంలో జీవిస్తూ ఉండే వారికి ఎక్కువగా శరీరక శ్రమ ఉండేది.

 If You Sit And Work For A Long Time, It Is Very Dangerous For Life , Dangerous,-TeluguStop.com

ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తూ ఉండవలసి వచ్చేది.ప్రస్తుత కాలంలో ఉన్న కొంతమంది యువతకు అసలు వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదు.

ఎందుకంటే ఇప్పటి కొన్ని ఉద్యోగాలు మనిషి శరీరానికి శ్రమ లేకుండా చేస్తున్నాయి.చాలా ఉద్యోగాలలో ఆ ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చొని పనిచేయాల్సి వస్తుంది.

అలా చాలా సేపు కూర్చుని పని చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మొదటిగా బరువు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గిపోతుంది.

ఎక్కువగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేసే ఉద్యోగులకు గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా అధ్యయనాలు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పనిచేసే వారి మరణాలు దాదాపు 6% గా ఉన్నాయి.

ప్రతిరోజు 8 గంటల కంటే ఎక్కువగా కదలకుండా కూర్చొని పని చేసేవారు ఉబకాయం తో మరణించే ప్రమాదం ఉందని చాలా పరిశోధనలు తెలిపాయి.తక్కువ సమయం కూర్చొని పనిచేసే వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కూడా కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

అయితే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే ఉద్యోగులు మధ్య మధ్యలో కొద్ది సేపు లేచి నిలబడి ఒక ఐదు నుంచి పది నిమిషాలు విరామం తీసుకోవాలి.అంతేకాకుండా వీరు ఎక్కువగా నీరు త్రాగాలి.

ఇలా చేస్తే వారి ఉద్యోగం తో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube