తెలుగులో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుని కృతిశెట్టి పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.కృతిశెట్టిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
అయితే ఈ మధ్య కాలంలో కృతిశెట్టికి వరుస షాకులు తగులుతున్నాయి.వరుసగా కృతిశెట్టి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయనే సంగతి తెలిసిందే.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ కాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు కూడా టాక్ ఆశించిన విధంగా లేదనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా కృతిశెట్టి కోరుకున్న సక్సెస్ ను అయితే అందించే అవకాశం మాత్రం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కృతిశెట్టి ఫ్యాన్స్ సైతం ఆమె కథల ఎంపిక విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కృతిశెట్టి సరైన కథలను ఎంచుకుంటే మాత్రమే ఆమె కెరీర్ పుంజుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే తాజాగా కృతిశెట్టి అభిమానులతో ముచ్చటించారు.ఒక అభిమాని గంగిరెద్దుపై కృతిశెట్టి ఫోటో ఉన్న ఫోటోను ఆమెతో పంచుకున్నారు.
బంగార్రాజు సినిమాలోని కృతిశెట్టి ఫోటోతో జనసేనకు ప్రచారం చేస్తున్నట్టుగా ఆ ఫోటోలు ఉన్నాయి.

కృతిశెట్టిని పవన్ గురించి చెప్పాలని అభిమాని అడగగా మీరు పవన్ కళ్యాణ్ కు ఏ విధంగా అభిమానులో నేను కూడా అదే విధంగా అభిమానినని ఆమె అన్నారు.భవిష్యత్తులో పవన్ కు జోడీగా నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని పరోక్షంగా ఆమె చెప్పకనే చెప్పేశారు.పార్టీలకు వెళ్లడం తనకు అస్సలు నచ్చదని కృతి చెప్పడం గమనార్హం.
కృతిశెట్టి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







