భారత్ ప్రధానిగా మోడీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా భారత్ పేరు మార్మ రోగుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచానికి పెద్దనాలాంటి అమెరికా గతంలో భారత్ విషయంలో పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు లేవు.
కానీ మోడీ ప్రధాని అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.అమెరికాభారత్ తో స్నేహం చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది.
ఇదిలా ఉంటే రేపు ప్రధాని మోడీ 72వ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు బీజేపీ బంగారపు ఉంగరాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.RSRM హాస్పిటల్ లో రేపు పుట్టే శిశువులకు రెండు గ్రాములు చొప్పున రింగులు అందజేయనుంది.
ఈ క్రమంలో రేపు 10 నుండి 15 మంది పిల్లలు జన్మించే అవకాశం ఉందని RSRM హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు.అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నియోజకవర్గంలో 720 కేజీల చేపలు పంపిణీ చేయడానికి కూడా తమిళనాడు బీజేపీ రెడీ అయింది.







