చిత్ర పరిశ్రమకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించే విషయం మనకు తెలిసిందే.ఇలా ఇప్పటివరకు 69వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం సినీ సెలబ్రిటీలకు అందించారు.
ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ అవార్డులను కూడా ప్రకటిస్తూ ఈ అవార్డు అందుకోబోతున్న సెలబ్రిటీల జాబితాని విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తెలుగు ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 ( Karthikeya 2 ) సినిమా ఈ అవార్డుకు ఎంపిక అయింది.
ఇకపోతే కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి( Rishab Shetty ) తన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతార( Kanthara ) .ఆధ్యాత్మిక సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా నిర్మించే పనిలో చిత్ర బృందం బిజీగా గడుపుతున్నారు.ఇక ఈ సినిమాలో రిషబ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో నటించిన అందుకు కాను ఈయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోబోతున్నారు.ఈ క్రమంలోనే నటుడు రిషబ్ శెట్టిపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురవడమే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే జాతీయస్థాయి అవార్డు అందుకున్న టాలీవుడ్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సైతం ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.జాతీయ అవార్డు ( National Award ) విజేతలు అందరికీ కూడా నా అభినందనలు.రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డుకు అర్హుడు అలాగే నా స్నేహితురాలు నిత్యమీనన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.
అలాగే డైరెక్టర్ చందు మొండేటి, నటుడు నిఖిల్ కి ప్రత్యేక అభినందనలు ఇక కార్తికేయ టీమ్ అందరికీ కూడా ఈయన అభినందనలు తెలుపుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.