సౌత్ ఇండియాలోని విలక్షమైన నటులలో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఒకరు కాగా మహారాజ సినిమాతో విజయ్ సేతుపతి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఈ సినిమాలోని మెసేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన విజయ్ సేతుపతి తాజాగా మంచి మనస్సును చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ప్రముఖ హాస్య నటుడు తెనాలి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని విజయ్ సేతుపతి దృష్టికి రాగా వాళ్లకు విజయ్ సేతుపతి అండగా నిలబడ్డారు.విజయ్ సేతుపతి నటించిన కొన్ని సినిమాలలో తెనాలి కమెడియన్ రోల్స్ లో నటించడం జరిగింది.
తెనాలి కొడుకు విన్నరపన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో( Dr.Mgr University ) చదువుకుంటుండగా ట్యూషన్ ఫీజు చెల్లించే విషయంలో విన్నరపన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిసి విజయ్ సేతుపతి అండగా నిలిచారు.
విజయ్ సేతుపతి చేసిన సహాయం గురించి తెనాలి( Tenali ) స్పందిస్తూ నా ఫ్యామిలీకి సహాయం చేసిన విజయ్ సేతుపతిని ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు.ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎంతోమంది ఆర్టిస్టులకు తన వంతు సహాయం అందించడం ద్వారా విజయ్ సేతుపతి వార్తల్లో నిలిచారు.విజయ్ సేతుపతి లాంటి మంచి మనస్సు చాలా తక్కువమందికి ఉంటుంది.
విజయ్ సేతుపతి తక్కువ సమయంలోనే ఏకంగా 50 సినిమాలు( 50 movies ) పూర్తి చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.విజయ్ సేతుపతికి తెలుగులో సైతం ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.అయితే కథ అద్భుతంగా ఉంటే మాత్రమే విజయ్ సేతుపతి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని భోగట్టా.
విజయ్ సేతుపతికి కెరీర్ పరంగా భారీ హిట్లు దక్కాలని అభిమానులు అయితే భావిస్తున్నారు.విజయ్ సేతుపతి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.