ప్రేక్షకులను మెప్పిస్తూ సినిమాలను హిట్ చేస్తున్న కొత్త తరం కమెడియన్లు వీళ్లే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లకు కొదవలేదు.మరే ఇండస్ట్రీలో లేని విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ లు ఉన్నారు.

 Rajkumar Kasireddy Rocks With His Comedy, Rajkumar Kasireddy, Kasi Reddy, Comedy-TeluguStop.com

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న పాత కమెడియన్లతో పాటు కొత్త తరం కమెడియన్లు కూడా ఉన్నారు.కాకపోతే వారికి సరైన అవకాశం రాక వెనకబడి ఉన్నారు.

కరెక్ట్ గా పడితే కొత్త తరం కమెడియన్లు ఎలా చెలరేగిపోతారో చెప్పేందుకు కొందరు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.అందుకు చక్కటి ఉదాహరణగా తాజాగా విడుదల అయిన ఆయ్ సినిమాలో నవ్వించే భారం మొత్తం రాజ్ కుమార్ కసిరెడ్డి ( Rajkumar kasireddy )మీదే పడింది.

Telugu Aay, Comedians, Harsha, Kasi Reddy, Rajkumar Kasi, Tollywood-Movie

చాలా సన్నివేశాల్లో హీరో హీరోయిన్లను డామినేట్ చేస్తూ మరీ ఈ నవ్వుల పర్వం కొనసాగించాడు రాజ్.వేరే ఆర్టిస్టు అయితే ఎలా ఉండేదో కానీ యూత్ కి మాత్రం ఇతను బాగా కనెక్టయ్యాడు.ఇటీవలి కాలంలో దొరికిన పెద్ద బ్రేక్ ఇదే అని చెప్పాలి.ప్రస్తుతం ఉన్న కమెడియన్ లలో సత్య కూడా ఒకరు.అవకాశం దొరకాలే కానీ పాత్రను పూర్తిగా వాడేసుకుని తన ఉనికిని చాటుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు సత్య.మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఎనర్జీని తట్టుకుంటూ మరీ కామెడీ చేయడం మాములు విషయం కాదు.

టాక్ సంగతి పక్కనపెడితే భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashri Borse )వెంటపడే జులాయిగా మంచి టైమింగ్ చూపించాడు.

Telugu Aay, Comedians, Harsha, Kasi Reddy, Rajkumar Kasi, Tollywood-Movie

జాతిరత్నాలు( Jathi Ratnalu ) టైంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఇలాగే కనిపించారు కానీ తర్వాత మహా బిజీ అయిపోవడంతో గ్యాప్ వచ్చేసింది.ప్రియదర్శి హీరోగా మారాక హీరో పక్కన రోల్స్ చేయడం లేదు.రాహుల్ ఛాన్స్ ఇస్తే మాత్రం ఆయా క్యారెక్టర్లను నిలబెడుతున్నాడు.

వెన్నెల కిషోర్ మరో ప్రామిసింగ్ పేరు.ఈ మధ్య కొంచెం రొటీన్ అనిపిస్తున్నా తనదైన పాత్ర దొరికితే బెస్ట్ ఇస్తాడు.

వైవా హర్షకు మంచి క్యారెక్టర్లు పడటం లేదు.సుందరం మాస్టర్ తో హీరో అయినా కామెడీ రోల్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నాడు.

అభినవ్ గోమటంని వాడుకోవడం దర్శకుల చేతుల్లో ఉంది.షకలక శంకర్, సత్యం రాజేష్, సప్తగిరి వీళ్లంతా సీనియర్ బ్యాచులోకి వచ్చేశారు.

బిత్తిరి సత్తిని తెస్తున్నారు కానీ ఏమంత ప్రభావం ఉండటం లేదు.అయితే కమెడియన్లకు కొరతే లేకపోయినప్పటికీ వారికి సరైన పాత్రలు సినిమాలు పడటం లేదు.

ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కామెడీ తరహాలో వచ్చే సినిమాలు చాలా తక్కువ అయ్యాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube