తాజాగా జాతీయ అవార్డులను అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.ఇందులో ఉత్తమ నటుడిగా కన్నడ ప్రముఖ నటుడు, హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) ఎంపిక అయిన విషయం తెలిసిందే.
కాంతార మూవీ లో నటనకు గాను ఈ అవార్డును అందుకున్నారు.దీంతో ఆ అవార్డుకు తగిన వాడే, అవార్డు ఇవ్వడంలో తప్పేమీ లేదు అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే తాజాగా అవార్డు గెలిచిన తర్వాత హీరో రిషబ్ శెట్టి ఒక ఎమోషనల్ నోట్ ని విడుదల చేశారు.
తను జాతీయ అవార్డు గెలవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అని అలాగే తనతో ఈ ప్రయాణంలో భాగం అయ్యిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపారు.అలాగే తనకి వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలో దేవ నర్తకులకి అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) గారికి అంకితం చేస్తున్నాను అని తెలిపారు.దీనితో ఇప్పుడు తన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.
కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ పోస్ట్ పై పునీత్ అభిమానులు అలాగే రిషబ్ శెట్టి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.రిషబ్ శెట్టి విషయానికి వస్తే.
కాంతార సినిమా ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్నది చాలా మందికి తెలియదు.
కానీ ఈ మూవీ తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి.అంతేకాకుండా తన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకులనుఆకట్టుకున్నారు.కాంతార లో ప్రతీ ఒక సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అంతలా తన నటనతో ఆకట్టుకున్నారు హీరో రిషబ్ శెట్టి.ఇక కాంతారలో క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2( Kantara 2 ) సినిమాలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.