కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేస్తుంటాడు.లోకేష్ సినిమాలు ఎప్పుడూ హిట్స్ అవుతుంటాయి.
మోస్ట్ సక్సెస్ఫుల్ కోలీవుడ్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు.అయితే రాజమౌళి లాగా ఈ డైరెక్టర్ సినిమాలో షూటింగ్స్‌కు ఎక్కువ టైం తీసుకోడు.
చాలా తక్కువ సమయంలోనే మూవీలను కంప్లీట్ చేస్తుంటాడు.ఎంత పెద్ద సినిమా అయినా సరే 150 రోజులలోపే కంప్లీట్ చేస్తుంటాడు.ఫస్ట్ మూవీ నగరం నుంచి లియో దాకా ఆయన ఎంత ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేశాడో తెలుసుకుందాం.
నగరం
( Nagaram )
శ్రీ, సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం “నగరం” మూవీ( Nagaram ) అతను ఎంత తక్కువ సమయంలో పూర్తి చేశాడో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్య.రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.ఇంత మంచి చిత్రాన్ని కేవలం 46 రోజుల వ్యవధిలో చిత్రీకరించి పూర్తి చేశారు.
ఖైదీ
లోకేష్ కనగరాజ్ తీసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖైదీ” ( Khidi )బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.రూ.25 కోట్లు పెట్టి తీస్తే ఇది రూ.105 కోట్ల వసూలు చేసింది.ఇందులో కార్తీ ప్రధాన పాత్రలో నటించగా నరేన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, జార్జ్ మరియన్, ధీనా కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీ 62 రోజుల్లో షూట్ చేశారని చాలా వర్గాలు పేర్కొన్నాయి.
కానీ కోసం 36-45 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశామని లోకేష్, కార్తీ ( Lokesh, Karti )స్వయంగా ప్రకటించారు.ఈ మూవీ మొత్తం రాత్రి సమయంలోనే షూట్ చేశారు.
• మాస్టర్
ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ తీసిన మాస్టర్ మూవీ ( Master movie )కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.రూ.135 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసింది.ఈ సినిమాలో విజయ్ టైటిల్ రోల్లో నటించగా, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.ఈ సినిమాని కేవలం 129 రోజుల్లో పూర్తి చేసి లోకేష్ ఒక రికార్డు సాధించాడు.
• విక్రమ్
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లీడ్ రోల్స్‌లో నటించిన విక్రమ్ సినిమా( Vikram movie ) రూ.500 కోట్లు వసూలు చేసి భారీ హిట్‌గా నిలిచింది.ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడానికి కేవలం 110 రోజులు మాత్రమే పట్టడం విశేషం.
• లియో
విజయ్ దళపతి హీరోగా నటించిన లియో మూవీ( Leo Movie ) షూటింగ్ కంప్లీట్ చేయడానికి కూడా 125 రోజుల సమయం మాత్రమే పట్టింది.