ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలకు పూర్తిస్థాయిలో ఆదరణ తగ్గిపోయిందని చెప్పాలి.ఇలా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వచ్చి చూసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఈ కారణాల గురించి ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు చర్చించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.ఇక థియేటర్ కి ప్రేక్షకులు దూరం కావడానికి ప్రధాన కారణం సినిమా టికెట్ల రేట్లు ( Ticket Price ) పెంచడమే.
భారీ స్థాయిలో సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో ఒక సామాన్య వ్యక్తి తన కుటుంబంతో వెళ్లి సినిమా చూసే పరిస్థితులు ఏర్పడలేదు.ఇక ఈ కారణమే కాకుండా సినిమాలు విడుదలైన అతి త్వరలోనే తిరిగి ఓటీటీ( OTT ) లో కూడా విడుదలవుతున్నాయి.
ఇలా చిన్న సినిమాలు థియేటర్లో విడుదలైన వారానికే తిరిగి ఓటీటీలో ప్రసారమవుతున్న నేపథ్యంలో చిన్న సినిమాలకు థియేటర్లలో భారీ స్థాయిలో ఆదరణ తగ్గిపోయింది.ఇక పెద్ద హీరోల సినిమాలు కూడా నెల తిరగకుండానే ఓటీటీలో విడుదల అవడంతో చాలామంది అంత రేట్లు పెట్టి థియేటర్ కి వెళ్లి చూడటం అవసరమా అన్న ధోరణిలో ఉన్నారు.అయితే తాజాగా ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా దిల్ రాజు( Dil Raju ) రేవు అని ఒక చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ఇది ఒక చిన్న సినిమాని థియేటర్ కి రాకుండా ఉండద్దు.ప్రతి ఒక్కరు థియేటర్లోనే ఈ సినిమా చూడాలని తెలిపారు.
అయినా మిమ్మల్ని థియేటర్లకు రాకుండా చేసింది మేమేనని ఈయన తెలిపారు.థియేటర్లో విడుదలైన సినిమాని చూసేకి రమ్మని చెప్పకుండా కొద్ది రోజులు ఉంటే ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుంది ఇంట్లో కూర్చొని చూడండి అంటూ మేమే చెప్పడంతోనే చిన్న సినిమాలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది అంటూ ఈయన ఓటీటీల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.