టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) ఈరోజు ఢిల్లీ టూర్ కి వెళ్ళనున్నారు.ఈరోజు , రేపు ఢిల్లీలోనే( Delhi ) మకాం వేసి కేంద్ర బిజెపి పెద్దలను , మరి కొంతమంది కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవమన్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడోసారి ఆయన ఢిల్లీ టూర్ కి వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు.
ప్రధాని నరేంద్ర మోది తో( PM Modi ) పాటు, కీలకమైన వివిధ శాఖల మంత్రులను ఆయన కలవనున్నారు.ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
అయితే చంద్రబాబు ఇంత ఆకస్మికంగా ఢిల్లీ టూర్ కి వెళుతుండడం వెనుక కారణాలు ఏమిటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో నిధుల కొరత వేధిస్తూ ఉండడం, దీంతోపాటు పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని ముందుగా అంచనా వేసినా కేంద్రం మాత్రం ఒక విషయంలో అంతంతమాత్రంగానే స్పందించడం, అమరావతికి( Amaravati ) కేవలం 15 వేల కోట్ల రూపాయలు అప్పు చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, అదనంగా కేంద్రం నుంచి అమరావతి లో రాజధాని నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి నిధుల విడుదల అంశం పైన ప్రధానంగా చంద్రబాబు బిజెపి పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతోపాటు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి భారీగా పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
పెట్టుబడి సాధనే లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పన పైన చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు.పారిశ్రమకు వేత్తల్లో నమ్మకాన్ని కలిగించి , ఏపీకి భారీగా పెట్టుబడులు సాధించేందుకు చంద్రబాబు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ విషయంలోనూ కేంద్రం సహకారం పూర్తిస్థాయిలో ఉండే విధంగా , ఏపీ కి నిధుల విడుదల, త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులు విషయం పైన కేంద్ర బిజెపి పెద్దలతో చంద్రబాబు చర్చించబోతున్నారట.దీంతో ఈ రోజు , రేపు ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు.