నోటి పూత.( Mouth Ulcer ) దీన్నే మౌత్ అల్సర్ అని కూడా అంటారు.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి పూత ఒకటి.చిగుళ్ళు, పెదవులు, నాలుక, లోపలి బుగ్గలు లేదా నోటి పైకప్పుపై చిన్న చిన్న పుండ్లు ఏర్పడుతుంటాయి.
ఇవి తీవ్రమైన నొప్పికి గురిచేస్తాయి.నోటి పూత వల్ల తినడానికి, తాగడానికి మాత్రమే కాదు మాట్లాడడానికి కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే నోటి పూతను తగ్గించుకునేందుకు మందులు వాడుతుంటారు.
అయితే కొన్ని ఇంటి చిట్కాలు కూడా నోటి పూత నుంచి త్వరగా రిలీఫ్ అందించడానికి తోడ్పడతాయి.
అటువంటి చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తులసి ఆకులు( Tulsi Leaves ) నోటి పూతకు న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తాయి.
నోటి పూత బారిన పడినప్పుడు రోజు ఉదయం, సాయంత్రం మూడు నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలాలి.ఇలా చేయడం వల్ల నోటి పూత తొందరగా తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లు మరియు ఎండు కొబ్బరి నోట్లో పుండ్లను వేగంగా తగ్గుతాయి.కాబట్టి రోజూ ఒక క్లాస్ కొబ్బరి నీళ్లు( Coconut Water ) తాగడం, ఎండు కొబ్బరిని నమలడం చేయండి.అలాగే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను నోట్లో పుండ్లపై అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు ఇలా చేయడం వల్ల మౌత్ అల్సర్ నుండి చాలా త్వరగా రిలీఫ్ పొందుతారు.
నోటి పూత వచ్చినప్పుడు మజ్జిగ,( Butter Milk ) నెయ్యి వంటివి ఎక్కువగా తీసుకోండి.ఇవి నోటిలో ఏర్పడిన పుండ్లను తొందరగా మాయం అయ్యేలా చేస్తాయి.లవంగాలు ఘాటుగా ఉన్న కూడా వాటికి నోటిపూతను తగ్గించే సామర్థ్యం ఉంది.కాబట్టి నోటి పూత వచ్చినప్పుడు రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలను నమలండి.ఇక నోటిలో పుండ్లు ఒక్కోసారి తీవ్రమైన నొప్పికి గురి చేస్తుంటాయి.అలాంటి సమయంలో ఐస్ ముక్కలతో వాటిపై రుద్దితే పెయిన్ నుంచి తక్షణ రిలీఫ్ పొందుతారు.