వీడియో: రీల్స్ కోసం ఆటో వెనుక వేలాడుతూ స్టంట్స్‌ చేసిన యువకులు.. చివరికి..?

కొంతమంది యువకులు సోషల్ మీడియాలో ఎక్కువ లైక్‌లు, ఫాలోవర్స్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో చాలా ప్రమాదకరమైన స్టంట్స్( Stunts ) చేస్తున్నారు.వీళ్ళు చేసే పనులు చూస్తే ఎవరికైనా భయమేస్తుంది.

 Boys Dangerous Skating Stunts Behind Running Auto Rickshaw Video Viral Details,-TeluguStop.com

ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ముగ్గురు చిన్న యువకులు ఒక ఆటో( Auto ) వెనుకాల స్కేట్‌బోర్డ్‌ మీద నిలబడి, ఆటోను పట్టుకుని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు.

రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడం ఎంత ప్రమాదమో వీళ్ళకు అర్థం కావట్లేదు.

మొదట ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఘజియాబాద్ నుంచి వచ్చిందని అందరూ అనుకున్నారు.కానీ, సోషల్ మీడియాలో( Social Media ) చాలామంది ఈ వీడియో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిందని చెప్పారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు.ఈ పిల్లలు మాత్రమే కాదు, వెనుక నుంచి వేగంగా వాహనం వస్తే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు.ఇంతకుముందు కూడా చాలా మంది యంగ్ స్టర్స్ ప్రమాదకరమైన పనులు చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.కొద్ది రోజుల క్రితం మైనర్స్‌ మహీంద్రా థార్ కారును తీసుకొని చాలా వేగంగా నడుపుతూ, ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వీడియోలు తీశారు.ఈ వీడియో చూసిన ఇతర పిల్లలు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు.

సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు.ఇలాంటి పనులు పిల్లలు చేయకుండా తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.

అసలే ఎవరూ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బండ్లు నడుపుతున్నారు.ఇందులో యువకులు స్టంట్స్‌ చేస్తూ రోడ్లను మరింత ప్రమాదకంగా మార్చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube