ఇది ప్రపంచంలోనే అతి చిన్న గ్రామం.. ఇక్కడ ఒక్క మహిళ మాత్రమే నివసిస్తుంది..?

సాధారణంగా ఈ ప్రపంచంలో చాలా చోట్ల చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి.ఇక్కడ కనీసం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు.

 This Is The Smallest Village In The World.. Only One Woman Lives Here, World's-TeluguStop.com

కానీ, ఓ చిన్న గ్రామం మాత్రం ఎవరూ ఊహించని పాపులేషన్ కలిగి ఉండి షాక్ ఇస్తోంది.ఇదే ప్రపంచంలోనే అతి చిన్న గ్రామం అని చాలా మంది అంటున్నారు.

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉందా గ్రామం.ఈ ఊరి పేరు మోనోవి( Monowi village ).ఈ గ్రామంలో కేవలం ఒక్కరే నివసిస్తున్నారు.నమ్మడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం.

ప్రపంచంలోని చాలా దూరపు ప్రాంతాలలో చాలా మంది నివసిస్తుంటారు.కానీ, మోనోవి గ్రామంలో ఒక్క మహిళ మాత్రమే నివసిస్తున్నారు.

ఆమె పేరు ఎల్సీ ఎయిలర్( Elsie Eiler, ) ఆమె చాలా సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు.ఆమె వయసు చాలా ఎక్కువ అయినప్పటికీ, గ్రామంలోని అన్ని పనులు ఆమె ఒక్కరే చేస్తున్నారు.

రోజువారీ పనులన్నీ కూడా ఆమే చేస్తున్నారు.ఒంటరిగా ఆమె జీవితం గడపడం చాలా విచిత్రంగా ఉందని ప్రజలు అంటున్నారు.

2010 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం, మోనోవి గ్రామంలో ఒక్కరే నివసిస్తున్నారు.ఆమే ఎల్సీ ఎయిలర్.2020 సంవత్సరం నాటికి ఆమె వయసు 86 సంవత్సరాలు.ఎల్సీ 2004 సంవత్సరం నుంచి ఆ ఒంటరిగా నివసిస్తున్నారు.

మేయర్, బార్ టెండర్, లైబ్రేరియన్ వంటి అందరి పనులు చేస్తున్నారు.ఈ గ్రామం సుమారు 54 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.ఒకప్పుడు ఈ గ్రామంలో చాలా మంది నివసిస్తుండేవారు.1930 సంవత్సరం నాటికి, ఆ ఊర్లో 123 మంది నివసిస్తుండేవారు.కానీ తర్వాత నివసించేవారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. 1980 సంవత్సరం నాటికి, కేవలం 18 మంది మాత్రమే మిగిలారు.2000 సంవత్సరం నాటికి, ఎల్సీ ఎయిలర్, ఆమె భర్త రూడీ మాత్రమే ఆ గ్రామంలో నివసిస్తుండేవారు.

2004 లో ఎల్సీ భర్త చనిపోయిన తర్వాత, ఆమె అక్కడే ఒంటరిగా ఉండిపోయింది.అక్కడికి ఎవరూ నివసించకపోయినా, వేసవి కాలంలో కొంతమంది ఆ గ్రామాన్ని చూడటానికి వస్తారు.ఎందుకంటే ఆ గ్రామం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

అలాగే, ఎల్సీకి కొంచెం సహాయం చేయడానికి కూడా వస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube