పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈయనని నమ్మి పిఠాపురం ( Pitapuram ) ప్రజలు అత్యధిక భారీ మెజారిటీతో తనని గెలిపించారు.
అయితే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే పిఠాపురం ప్రజల తలరాత పూర్తిగా మార్చేస్తున్నారని చెప్పాలి.ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తనకంటూ ఇల్లు నిర్మించడం కోసం స్థలం కొనుగోలు చేయడంతో అక్కడ భూముల ధరలకు భారీ స్థాయిలో రెక్కలు వచ్చాయని చెప్పాలి.
ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పవన్ కళ్యాణ్ ఎక్కడ కొన్నారనే విషయాన్ని తెలుసుకొని భారీ ధరలకు భూములను కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో భూమి ధరలు భారీగా పెరిగిపోయాయి.
ఇకపోతే తాజాగా పిఠాపురం విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ఉపాసన ( Upasana ) సంచలన నిర్ణయం తీసుకున్నారు అంటూ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పిఠాపురం ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండడం కోసం అక్కడ అపోలో హాస్పిటల్( Appolo hospital ) కొత్త బ్రాంచ్ ప్రారంభించబోతున్నారని విషయాన్ని ఈయన వెల్లడించారు.
ఇప్పటికే ఉపాసన రాంచరణ్ పిఠాపురంలో అపోలో హాస్పిటల్ నిర్మాణం కోసం 10 ఎకరాల పొలం కొనుగోలు చేశారని ఈయన వెల్లడించారు.రాబోయే రోజుల్లో స్వర్గ లోకం అంటే ఎక్కడో ఉండదని పిఠాపురంలో ఉంటుందనే విషయాన్నీ అందరు నమ్ముతారని కూడా చెప్పాడు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పిఠాపురంలోనే ఉండబోతుందని విషయం వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.