ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.ఈ ఫోటోలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డి తో( Bharati Reddy ) కలిసి సాధారణ ప్రయాణికుడి వలే విమానంలో ప్రయాణం చేశారు.
వీరి ఇరువురు ఇంత సింపుల్గా విమానంలో ప్రయాణం చేయడం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.ఈ ఫోటో చూస్తే ఏదో విమానంలో జగన్ దంపతులు ఇద్దరు ఎంతో సాదాసీదాగా ఎకానమీ క్లాసులో( Economy Class ) ప్రయాణం చేస్తున్నట్లుగా కనబడుతోంది.
అయితే ఈ ప్రయాణం ఇప్పుడు జరిగిందన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.
ఇకపోతే ఈ ఫోటోపై జగన్ ను ట్రోల్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.కాకపోతే., ఈ ఫోటో అసలు నిజమైందా.? లేదా ఎవరైనా ఎడిట్ చేసి ఇచ్చిందా.? అనే విషయంపై కూడా ఇంకా తెలియ రాలేదు.చూడాలి మరి ముందు ముందు ఈ ఫోటో పై ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.ఇక ఈ ఫోటో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్ చేస్తున్నారు.
కొందరైతే., వారు అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ భద్రతతో చాలామంది సెక్యూరిటీ, అలాగే ప్రభుత్వ అధికారులు హడావిడి కనబడుతుంది.
అంతేకాదు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు స్పెషల్ క్యాన్వాయ్ ఉంటుంది.ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ జిల్లాకు పర్యటన వెళ్లాల్సి వచ్చిన కేవలం ప్రత్యేక విమానాల్లో( Special Flight ) మాత్రమే ఆయన పర్యటించేవారు.ఎక్కడికైనా విదేశీ టూర్లో వెళ్లాల్సిన సమయంలో కూడా ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లేవారు.ఇకపోతే ఎన్నికల తర్వాత వేరేలా పరిస్థితి ఏర్పడింది.ఎన్నికల తర్వాత కూడా ఆయన చాలాసార్లు విజయవాడ – బెంగళూరు మధ్య ప్రయాణం చేయడానికి ప్రత్యేక విమానాన్ని వాడుకున్నారు.