భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Narendra Modi ) వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.సెప్టెంబర్ 22, 23 తేదీల్లో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో( United Nations meetings ) ఆయన పాల్గొనే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలోనూ మోడీ పాల్గొంటారని తెలుస్తోంది.ప్రధాని న్యూయార్క్ పర్యటన గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
దీనితో పాటు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలోనూ మోడీ పాల్గొంటారని సమాచారం.మెరుగైన వర్తమానం.
భవిష్యత్తుకు రక్షణ అనే అంశంపై దేశాధినేతలను ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఈ సదస్సు నిర్వహిస్తోంది.

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US presidential election ) జరగనున్న వేళ మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు.అమెరికా ఎన్నికల్లో భారతీయుల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మెజారిటీ రాష్ట్రాల్లో అభ్యర్ధుల గెలుపోటములను ఇండో అమెరికన్లు నిర్దేశిస్తున్నారు.అందుకే భారతీయులను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు తంటాలు పడుతుంటాయి.
ఈసారి ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) పోటీలో ఉండటంతో మెజార్టీ ఎన్ఆర్ఐలు ఆమె వైపు మొగ్గుచూపుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక డెమెక్రాట్లు, రిపబ్లికన్లకు ప్రధాని మోడీ కావాల్సిన వ్యక్తే.గతంలో 2020 అధ్యక్ష ఎన్నికలకు ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి టెక్సాస్( Texas )లోని హ్యూస్టన్‌లో హౌడీ మోడీ ఈవెంట్‌కు హాజరయ్యారు.ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించిన నాటి సభకు దాదాపు 50 వేల మందికి పైగా హాజరయ్యారని అంచనా.
మోడీ చేయి పట్టుకుని ఆడిటోరియం మొత్తం కలియతిరిగారు ట్రంప్.ఈసారి ఎన్నికల్లో నరేంద్రమోడీ ఏ పార్టీకి మద్ధతు పలుకుతారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.