అమెజాన్( Amazon )లో ఒక కస్టమర్‌కు తన బర్త్‌డే గిఫ్ట్‌గా ₹31,500 విలువ చేసే టిస్సాట్ వాచ్ కొన్నారు.కానీ ఈ ఆర్డర్ వల్ల వారికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
వాచ్ వచ్చిన తర్వాత, అది ఒరిజినల్ వాచీ ఏనా అని చెక్ చేయడానికి సీరియల్ నంబర్ ఎంటర్ చేశారు.అలా చేసినప్పుడు, ఆ వాచ్ ఇంతకు ముందు ఎవరో వాడిన వాచ్ అని తెలిసింది.
దీంతో కస్టమర్ షాక్ అయ్యారు.అమెజాన్‌కు కంప్లైంట్ చేసి, కొత్త వాచ్ ఇవ్వమని అడిగారు.
దారుణమైన విషయం ఏమిటంటే, వారు మళ్లీ పంపించిన వాచ్ టిస్సాట్ కాదు, అది ఓ అర్మాని వాచ్. సదరు బాధితుడు ఈ సంఘటన గురించి “ది డిసిప్లైన్డ్ ఇన్వెస్టర్” అనే ట్విట్టర్ ఐడీతో “అమెజాన్ చేసిన మోసం” అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టారు.“అమెజాన్ నుంచి నేను జూలై 21న టిస్సాట్ PRX గడియారం( Tissot PRX ) ఆర్డర్ చేశాను.జులై 28న మెగా స్టోర్ LLP అనే సెల్లర్ నుంచి నాకు ఆ గడియారం చేరింది.
అది నిజమైన గడియారమా కాదా అని చెక్ చేయడానికి టిస్సాట్ వెబ్సైట్లో దాని సీరియల్ నంబర్ ఎంటర్ చేశాను.అప్పుడు ఆ గడియారం 2023 ఫిబ్రవరి 15న కొన్నదని తెలిసింది.
అంటే, అది పాత గడియారం అని అర్థం.ఆ పాత టిస్సాట్ గడియారం రీప్లేస్‌గా నాకు అర్మాని గడియారం ఇచ్చారు.
అమెజాన్‌కు కంప్లైంట్ చేశాను.అప్పుడు వారు కొత్త గడియారం ఇస్తామని, ఆ సెల్లర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కానీ కొత్త గడియారం వచ్చినప్పుడు, అందులో టిస్సాట్ బాక్స్‌లో అర్మాని వాచ్ ఉంది.” అని వాపోయారు.
ఈ సమస్యను అమెజాన్‌కు రిపోర్ట్ చేసినప్పుడు, కస్టమర్ కేర్ సీనియర్ సిబ్బందికి కాల్స్‌ను బదిలీ చేస్తూనే ఉంది, ఫలితంగా సమస్యను పరిష్కరించకుండా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది.ఈ సమస్యను వివరించడానికి ఫామ్‌ను పూరించిన తర్వాత కూడా, కంపెనీ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు.6-12 గంటలలోపు కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తామని అమెజాన్ హామీ ఇచ్చింది కానీ 24-48 గంటల తర్వాత కూడా కాల్ చేయలేదని యూజర్ పేర్కొన్నారు.
ఈ పోస్ట్ వైరల్‌గా మారింది, నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ సర్వీస్ చెత్తగా మారిందని చాలా మంది విమర్శించారు.“వినియోగదారుల కోర్టులో ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వండి.ఆ కంప్లైంట్ కాపీని అమెజాన్ కి సెండ్ చేయండి.నేను అలాగే చేస్తే 12 గంటల్లో ప్రాబ్లెమ్ సాల్వ్డ్” అని ఒక నెటిజన్ సలహా ఇచ్చారు.అమెజాన్ సర్వీస్ వరస్ట్ గా ఉంటుందని మరొకరు అన్నారు.ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ బాగుందని చెప్పారు.“ఆన్లైన్లో ఖరీదైన గడియారాలు కొనకండి.నేను ఎవరినీ నమ్మను.
వారు అసలు వస్తువులు అమ్ముతున్నారా లేదా అని తెలియదు.అవును, వాటి ధర తక్కువగా ఉంటుంది కానీ, ఒక నెల తర్వాత గడియారాలు పనిచేయడం మానేస్తాయని చాలా రివ్యూలు చెబుతున్నాయి.” అని ఇంకొకరు పేర్కొన్నారు.