స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా మృణాల్ నటిస్తున్నారా.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు.ప్రభాస్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమాకు ఫౌజీ( Fauji ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

 Shocking Update About Prabhas Mrunal Combination Details, Prabhas, Mrunal Thakur-TeluguStop.com

ఈనెల 17వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.

అయితే మృణాల్ ఠాకూర్ మాత్రం వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదు అని చెబుతున్నారు.ప్రభాస్ కు జోడిగా తాను నటిస్తున్నాను అని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దు అని ఆమె కోరుతున్నారు.

దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం( Sita Ramam ) సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి తన నటనతో మెప్పించారు.అందువల్ల ఫౌజీ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించవచ్చని వార్తలు వినిపించాయి.

హీరోయిన్ నుంచి స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

Telugu Fauji, Kalki, Mrunal Thakur, Prabhas, Prabhasmrunal, Sita Ramam, Rajasaab

ప్రభాస్ కొత్త సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకు జరగని స్థాయిలో ప్రభాస్ సినిమాలకు బిజినెస్ జరుగుతోంది.టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.ప్రభాస్ గత సినిమాలలో రాధే శ్యామ్ మినహా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా కూడా నిరాశ పరచలేదు.

Telugu Fauji, Kalki, Mrunal Thakur, Prabhas, Prabhasmrunal, Sita Ramam, Rajasaab

ప్రభాస్ ప్రస్తుతం కన్నప్ప సినిమాతో పాటు ది రాజా సాబ్( The Rajasaab ) సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలను రిలీజ్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చిన ప్రభాస్ ఆ మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటున్నారు.ఈ ఏడాది ఇప్పటికే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలో కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube