స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా మృణాల్ నటిస్తున్నారా.. ఆమె రియాక్షన్ ఏంటంటే?
TeluguStop.com
స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు.
ప్రభాస్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమాకు ఫౌజీ( Fauji ) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈనెల 17వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.
అయితే మృణాల్ ఠాకూర్ మాత్రం వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదు అని చెబుతున్నారు.
ప్రభాస్ కు జోడిగా తాను నటిస్తున్నాను అని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దు అని ఆమె కోరుతున్నారు.
దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం( Sita Ramam ) సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి తన నటనతో మెప్పించారు.
అందువల్ల ఫౌజీ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించవచ్చని వార్తలు వినిపించాయి.హీరోయిన్ నుంచి స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.
"""/" /
ప్రభాస్ కొత్త సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకు జరగని స్థాయిలో ప్రభాస్ సినిమాలకు బిజినెస్ జరుగుతోంది.
టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.
ప్రభాస్ గత సినిమాలలో రాధే శ్యామ్ మినహా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా కూడా నిరాశ పరచలేదు.
"""/" /
ప్రభాస్ ప్రస్తుతం కన్నప్ప సినిమాతో పాటు ది రాజా సాబ్( The Rajasaab ) సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలను రిలీజ్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చిన ప్రభాస్ ఆ మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలో కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నాను.. స్టార్ హీరో సంచలన పోస్ట్!