సాధారణంగా ఒక సినిమా హిట్ కావడంలో ఆ మూవీ టైటిల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.శంకర్ దాదా ఎంబీబీఎస్, కొబ్బరి బొండం, ఆ ఒక్కటీ అడక్కు, బ్రహ్మచారి మొగుడు, క్రాక్, మిరపకాయ, బలుపు, ఓం భీమ్ బుష్, దరువు లాంటి సినిమా టైటిల్స్ చూస్తే భలే విచిత్రంగా అనిపిస్తుంది.
కొన్ని సినిమా పేర్లు ఇలా ఫన్నీగా ఉంటే కొన్ని మాత్రమే మిస్టీరియస్‌గా ఉంటాయి.వాటికి ఏంటి అర్థం అని మనం అనుకోకుండా ఉండలేం.
సినిమాలో కూడా ఆ టైటిల్స్‌కి అర్థం అనేది దొరకదు.ముఖ్యంగా కొన్ని సినిమాల అర్థాలు తెలియక చాలామంది ప్రేక్షకులు గందరగోళంలో పడిపోయారు.అలాంటి కొన్ని సినిమా పేర్లు, వాటికి అసలైన అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• విరాటపర్వం
సాయి పల్లవి, రానా దగ్గుబాటి హీరో హీరోయిన్లుగా వచ్చిన విరాటపర్వం సినిమా( Virataparvam ) ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.ఈ పీరియడ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ భార్య అంచనాలు నడుమ విడుదలై డిజాస్టర్ అయ్యింది రూ.15 కోట్లు పెడితే రూ.12 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.అయితే ఈ మూవీ టైటిల్ మీనింగ్ చాలామందికి తెలిసి ఉండదు.
“విరాటపర్వం” పదం మహాభారతంలో( Mahabharatam ) కనిపిస్తుంది.సింపుల్‌గా దీనికి అర్థం “విరాట రాజు కాలం నాటి సంఘటనలు” అని చెప్పవచ్చు.
ఈ కాలంలో చాలా కుళ్లు, కుతంత్రాలు, రాజకీయాలు జరిగాయట.విరాటపర్వం సినిమాలో కూడా ఇలానే సంఘటన జరుగుతాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టారని అంటారు.
మహాభారతం కథలోకి వస్తే విరాట రాజు మత్స్య దేశాన్ని ఏలినాడు.పాండవులు తమ వనవాస కాలంలో ఒక సంవత్సరం ఈ రాజు వద్ద రహస్యంగా ఉండవలసి వచ్చింది.
విరాట రాజు సతీమణి సుదేష్ణ.వారికి కుమారుడు ఉత్తర, కుమార్తె ఉత్తర ఉన్నారు.ఈ ఉత్తరను అర్జునుని కుమారుడు అభిమన్యు వివాహం చేసుకున్నాడు.ఈ విరాట రాజు గురించి మహాభారతం నాల్గవ భాగమైన విరాట పర్వంలో వివరంగా చెప్పడం జరిగింది.
• ఆదిత్య 369
కాలంతో పాటు ప్రయాణించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు.అయితే టైమ్ ట్రావెల్ మిషన్‌కు నెంబర్ ఉండాలి కాబట్టి 369 అని పెట్టారు.అలా ఆదిత్య 369 ( Aditya 369 ) అని బాలకృష్ణ సైన్స్ ఫిక్షన్ మూవీకి పేరు పెట్టారు.ఈ మూవీ సూపర్ హిట్ అయింది.దీనికి సీక్వెల్ తీయాలని బాలకృష్ణ( Balakrishna ) భావిస్తున్నట్లుగా సమాచారం.ఇప్పుడు మూవీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.
విజువల్ ఎఫెక్ట్స్ తో సీక్వెల్ అద్భుతంగా తీసి పాన్ ఇండియా లెవెల్ లో హిట్ సాధించవచ్చు.
• సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని( Nani ) తన అప్‌కమింగ్ సినిమాకి “సరిపోదా శనివారం”( Saripodhaa Sanivaaram ) అని టైటిల్ పెట్టాడు.ఈ మూవీలో నాని తన అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు శాంతంగా ఉంటాడు ఆ శనివారం మాత్రం చాలా వైల్డ్ గా మారుతాడు.ఆ ఒక్క శనివారం తనకు సరిపోదా అన్నట్టు ఈ టైటిల్ కి మూవీ పెట్టారు.