ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ 

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu naidu ) గుడ్ న్యూస్ చెప్పారు.ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల బదిలీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 Chandrababu Good News For Telangana Employees In Ap , Ap, Telangana, Ap Cm Chand-TeluguStop.com

ఏపీ , తెలంగాణ విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా , ఇప్పటికీ చాలా సమస్యలు పెండింగ్ లో ఉండడం , ముఖ్యంగా ఆస్తుల విభజన,  భవనాలు ఖాళీ చేయడం,  ఉద్యోగాల బదిలీ వంటి అంశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.ఈ నేపద్యంలోనే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల ను తిరిగి వారి సొంత రాష్ట్రంలో వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Telugu Ap, Revanth Reddy, Telangana-Politics

తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం వేరువేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.  తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్ లోని చివరి ర్యాంక్ లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

  ఏపీ తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీకే కేటాయించగా,  వారిలో కొంతమంది తిరిగి తెలంగాణ( Telangana )కు వెళ్లిపోయారు.మిగిలిన వారు మాత్రం అక్కడే పని చేస్తూ ఉండిపోయారు.

Telugu Ap, Revanth Reddy, Telangana-Politics

ఈ నేపథ్యంలోనే జులై 6 వ తేదీన హైదరాబాదులో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,  రేవంత్ రెడ్డి( Revanth Reddy )లు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఉద్యోగుల బదిలీ అంశం పైన చర్చకు వచ్చినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది.దీంతో వారి బదిలీలకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube