సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం అనేది ఇటీవల కాలంలో చాలా సర్వసాధారణం అయింది.ఇప్పటికే ఎంతోమంది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా నటుడు శర్వానంద్( Sharwanand ) సైతం విడాకులు (Divorce ) తీసుకోబోతున్నారట ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అదేంటి శర్వానంద్ రక్షిత రెడ్డి ( Rakshitha Reddy ) వివాహం జరిగి ఏడాది పూర్తి అయ్యింది.
అప్పుడే విడాకులు తీసుకొని విడిపోవడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.
![Telugu Divorce, Rakshitha Reddy, Ram Abbaraju, Sakshi Vaidya, Samyuktha Menon, S Telugu Divorce, Rakshitha Reddy, Ram Abbaraju, Sakshi Vaidya, Samyuktha Menon, S](https://telugustop.com/wp-content/uploads/2024/08/social-media-Sharwanand-Rakshitha-Reddy-Ram-Abbaraju-Divorce-Sakshi-Vaidya-Tollywood-movie.jpg)
శర్వానంద్ రక్షిత రెడ్డిది పెద్దలు కుదిర్చిన వివాహం.ఈ దంపతులు పెళ్లైన ఏడాదిలోపే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు .ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటని అభిమానులు ఆరా తీస్తున్నారు.అయితే ఈయన విడాకులు తీసుకుంటున్నారు అంటే నిజ జీవితంలో కాదండోయ్ ఈయన చేస్తున్న ఓ సినిమాలో భాగంగా ఇలా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
![Telugu Divorce, Rakshitha Reddy, Ram Abbaraju, Sakshi Vaidya, Samyuktha Menon, S Telugu Divorce, Rakshitha Reddy, Ram Abbaraju, Sakshi Vaidya, Samyuktha Menon, S](https://telugustop.com/wp-content/uploads/2024/08/SharwanandRakshitha-Reddy-Divorce-Sakshi-Vaidya-Tollywood-movie.jpg)
ప్రస్తుతం శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే సామజ వరగమన సినిమా దర్శకుడు అబ్బరాజు( Ram Abbaraju ) దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమాకి కమిట్ అయ్యారు.అయితే ఈ సినిమా విడాకుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ విడిపోవలసి రావడంతో విడాకుల కోసం తిరిగే స్టోరీలో శర్వానంద్ నటించబోతున్నారని సమాచారం.ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు హీరోయిన్స్ గా చేస్తున్నారు.మరి ఈ విడాకుల కాన్సెప్ట్ తో శర్వానంద్ సినిమా చేస్తున్న దాంట్లో ఎంత వరకు నిజం ఉంది అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.