శోభిత చైతు జాతకాలపై మరో జ్యోతిష్యుడు కామెంట్స్..  వేణు స్వామిని మించి ఉన్నాడే?

గత వారం రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నాగచైతన్య( Nagachaitanya ) శోభిత ( Sobhita) గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.నాగచైతన్య సమంతకు( Samantha ) విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను పెళ్లి చేసుకోవడంతో వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Pandit Jagannath Guruji Sensational Comments On Chaitanya And Sobita Married Lif-TeluguStop.com

ఇకపోతే చైతన్య శోభిత నిశ్చితార్థం అయిన వెంటనే వేణు స్వామి(Venu Swamy) వీరి జాతకాలను చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు .వీరిద్దరూ విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 2027వ సంవత్సరంలో ఒక స్త్రీ కారణంగా విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Married, Nagachaitanya, Nagarjuna, Panditjagannath, Sobita, Venu Swamy-Mo

ఈ విధంగా వేణు స్వామి నాగచైతన్య శోభిత గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఈయనపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు దీంతో మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు కూడా జారీ చేశారు.ప్రస్తుతం ఈ విషయం వివాదంగా మారింది.అయితే తాజాగా మరో పండితుడు కూడా చైతన్య శోభిత జాతకాల గురించి వెల్లడించారు ఉత్తరాదిన జ్యోతిషుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పండిట్ జగన్నాథ్ గురూజీ ( Pandit Jagannath Guruji ) వీరిద్దరి జాతకం గురించి వెల్లడించారు.

Telugu Married, Nagachaitanya, Nagarjuna, Panditjagannath, Sobita, Venu Swamy-Mo

ఈ సందర్భంగా జగన్నాథ్ గురూజీ మాట్లాడుతూ శోభిత చైతన్య 2025వ సంవత్సరం ప్రతమార్థంలో పెళ్లి చేసుకుంటే వీరి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగుతుందని తెలిపారు.న్యూమరాలజీ ప్రకారం వీరి నిశ్చితార్థం 2024 ఆగస్టు 8వ తేదీ జరిగింది.న్యూమరాలజీ ప్రకారం 8 అంటే అనంతం వారి జీవితంలో అపరిమితంగా ఆనందం, అనుబంధాలు, భావోద్వేగాలు కొనసాగుతాయి.

శోభిత కేవలం నాగచైతన్యతో మాత్రమే కాకుండా అక్కినేని కుటుంబంతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు.శోభితా అనుసరించే ప్రవర్తన వల్లే నాగచైతన్య దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది.

వాళ్లిద్దరూ ప్రేమ పక్షులుగా లైఫ్‌ను ఆస్వాదిస్తారని పండిట్ జగన్నాథ్ గురూజీ వీరి జాతకం గురించి చెప్పడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube