శోభిత చైతు జాతకాలపై మరో జ్యోతిష్యుడు కామెంట్స్..  వేణు స్వామిని మించి ఉన్నాడే?

గత వారం రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నాగచైతన్య( Nagachaitanya ) శోభిత ( Sobhita) గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

నాగచైతన్య సమంతకు( Samantha ) విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను పెళ్లి చేసుకోవడంతో వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే చైతన్య శోభిత నిశ్చితార్థం అయిన వెంటనే వేణు స్వామి(Venu Swamy) వీరి జాతకాలను చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు .

వీరిద్దరూ విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 2027వ సంవత్సరంలో ఒక స్త్రీ కారణంగా విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

"""/" / ఈ విధంగా వేణు స్వామి నాగచైతన్య శోభిత గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఈయనపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు దీంతో మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు కూడా జారీ చేశారు.

ప్రస్తుతం ఈ విషయం వివాదంగా మారింది.అయితే తాజాగా మరో పండితుడు కూడా చైతన్య శోభిత జాతకాల గురించి వెల్లడించారు ఉత్తరాదిన జ్యోతిషుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పండిట్ జగన్నాథ్ గురూజీ ( Pandit Jagannath Guruji ) వీరిద్దరి జాతకం గురించి వెల్లడించారు.

"""/" / ఈ సందర్భంగా జగన్నాథ్ గురూజీ మాట్లాడుతూ శోభిత చైతన్య 2025వ సంవత్సరం ప్రతమార్థంలో పెళ్లి చేసుకుంటే వీరి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగుతుందని తెలిపారు.

న్యూమరాలజీ ప్రకారం వీరి నిశ్చితార్థం 2024 ఆగస్టు 8వ తేదీ జరిగింది.న్యూమరాలజీ ప్రకారం 8 అంటే అనంతం వారి జీవితంలో అపరిమితంగా ఆనందం, అనుబంధాలు, భావోద్వేగాలు కొనసాగుతాయి.

శోభిత కేవలం నాగచైతన్యతో మాత్రమే కాకుండా అక్కినేని కుటుంబంతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

శోభితా అనుసరించే ప్రవర్తన వల్లే నాగచైతన్య దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది.వాళ్లిద్దరూ ప్రేమ పక్షులుగా లైఫ్‌ను ఆస్వాదిస్తారని పండిట్ జగన్నాథ్ గురూజీ వీరి జాతకం గురించి చెప్పడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫుడ్ వెండర్ సమాధానానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. వీడియో వైరల్