భారతదేశంలో రావి చెట్టు ఎంతో పవిత్రమైనది.పురాతన కాలం నుంచి హిందువులు రావి చెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు.
రావి చెట్టు ఆకులు( Peepal leaves ), పండ్లు, బెరడు, వేర్లు ఇలా అన్నిటిలోనూ ఔషధగుణాలు నిండి ఉంటాయి.రావి చెట్టు నుంచి వచ్చే గాలి కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది.
ముఖ్యంగా రావి ఆకులు మన ఆరోగ్యానికి వరం అనే చెప్పుకోవచ్చు.అనేక రోగాలను రావి ఆకులు నయం చేస్తాయి.
సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేయడానికి రావి ఆకులు అద్భుతంగా తోడ్పడతాయి.లేతగా ఉన్న రెండు రావి ఆకులను ఒక గ్లాసు పాలలో వేసి మరిగించి తేనె కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )బలపడుతుంది.సీజనల్ వ్యాధులు దూరం అవుతాయి.జ్వరం కూడా చాలా వేగంగా తగ్గుతుంది.అలాగే వాటర్ లో రావి ఆకులు వేసి మరిగించి ఆ కషాయాన్ని తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కడుపులో పుండ్లు ఉంటే నయం అవుతాయి.నెలసరి సమయంలో స్త్రీలలో అధిక రక్తస్రావం సమస్య దూరం అవుతుంది.
రావి చెట్టు ఆకులు నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.రావి ఆకులు నమలడం వల్ల నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
దంతాలపై పసుపు పరకలు వదిలిపోతాయి.దంతాలు తెల్లగా, శుభ్రంగా మారతాయి.
చిగుళ్ళు బలోపేతం అవుతాయి.
మలబద్ధకం సమస్య( Constipation )ను వదిలించడానికి కూడా రావి ఆకులు తోడ్పడతాయి.రావి ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేయాలి.ఈ పొడిని సోంపు, బెల్లంతో కలిపి ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి నైట్ నిద్రించే ముందు తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మలబద్ధకం పరార్ అవుతుంది.అంతేకాదు రావి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల వయసు పెరిగినా చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.