ప్రస్తుతం ఏపీలో వైసిపి నేతలే టార్గెట్ గా టిడిపి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది .గత వైసిపి ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలతో పాటు, అప్పట్లో దూకుడుగా వ్యవహరిస్తూ టిడిపిని టార్గెట్ చేసుకుని విమర్శలతో విరుచుకుపడిన నేతల అవినీతి వ్యవహారాలను బయటపెడుతూ అరెస్టుల పర్వానికి తెర తీసింది.
మాజీ మంత్రి భోగి రమేష్( Jogi Ramesh ) కుమారుడు జోగి రాజీవ్ ను అగ్రి గోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు.చంద్రబాబు నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు నేడు విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు ఇచ్చారు.
ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది .అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అనుచరులను కూడా అరెస్టు చేశారు .వంశీని అరెస్ట్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు . వంశీ ఆచూకీ మాత్రం దొరకకపోవడంతో ఆయన ఎక్కడున్నారు అనేది ఎవరికి తెలియక పోవడంతో ప్రత్యేక బృందాలు వంశీ ఆచూకీ కోసం వెతుకులాట మొదలు పెట్టాయి.
గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో వంశీ పై( Vallabhaneni vamsi, ) కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే వంశీని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. వంశీ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది .ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇటీవల వంశీ అనుచరులను అరెస్ట్ చేసిన సమయంలో వంశీని కూడా అరెస్ట్ చేశారు అంటూ ప్రచారం జరిగింది.అయితే వంశీ దొరకలేదంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
.ఆ సమయంలోనే వంశీ వ్యవహారంపై అధికార కూటమి పార్టీలు, వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి .వంశీని ఎట్టి పరిస్థితులోనైనా అరెస్టు చేయాల్సిందేనని, గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారం చంద్రబాబు( Chandrababu naidu )ను , ఆయన కుటుంబ సభ్యుల పైన కించపరిచే వ్యాఖ్యలు చేసి ఇప్పుడు పారిపోయారంటూ టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు .వంశీ పై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని , టిడిపి నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.