అక్రమ వలసదారుల కారణంగా అమెరికాలో ( America )శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.దొడ్డిదారిన అగ్రరాజ్యంలో అడుగుపెడుతున్న వారిలో నేరప్రవృత్తి ఉన్న వారు ఉండటంతో వీరు దోపిడీలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
అధ్యక్షుడు జో బైడెన్ విధానాల వల్ల అమెరికా ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని రిపబ్లికన్లు, జాతీయవాదులు మండిపడుతున్నారు.తాజాగా బ్రూక్లిన్‌లో ఓ వలసదారుడు కత్తితో బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఆరోపణలు చేసింది.
గతంలో లైంగిక వేధింపుల చరిత్ర ఉన్న నిందితుడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.అతను నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించలేదు , చంపాలని చూస్తున్నాడని ఆమె న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు.
24 ఏళ్ల నికరాగ్వాన్ వలసదారుడు డేనియల్ డావన్ – బోనిల్లా( David Davon-Bonilla ) రిగెల్మాన్ .బోర్డ్‌వాక్ కింద ఆగస్ట్ 11న ఈ దాడికి పాల్పడ్డాడు.తనపై అతను మరోసారి దాడికి తెగబడతాడని ఆమె భయపడుతున్నారు.బాధిత మహిళ ఆమె ప్రియుడు రే రామ్‌సమ్మి కొంతకాలంగా మైమోనిడెస్ పార్క్ స్టేడియం వెనుక బోర్డ్‌వాక్ కింద ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు.
ఇది పూర్తిగా చెత్తతో నిండిన ప్రదేశం.వలసదారులతో సహా నిరాశ్రయులైన ప్రజలు ఇక్కడ ఆశ్రయం పొందుతుంటారు.
34 ఏళ్ల రామ్‌సమ్మి దాడి జరిగిన ముందు రోజు రాత్రి , ఉదయం దావోన్ బోనిల్లా, అతని సహచరుడు మెక్సికన్ జాతీయుడు లియోవాండో మోరెనోలను చూశానని వెల్లడించారు.ఇంతలో తాను కాఫీ తాగేందుకు వెళ్లానని, ఉదయం 8:45 గంటలకు తాత్కాలిక శిబిరానికి తిరిగి వస్తుండగా, తన ప్రియురాలిపై దాడి జరగడాన్ని చూశానని రామ్‌సమ్మి తెలిపారు.తాను వచ్చి చూసే సరికి ఆమెను అతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడని.ముఖంపై కత్తి పెట్టడంతో తన ప్రియురాలు బిగ్గరగా అరుస్తోందన్నారు.ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.వెనుక నుంచి నిందితుడి మిత్రుడు మోరెనో ఒక పైపుతో తనపై దాడి కొట్టినట్లు చెప్పాడు.
దీంతో తాను బయటికి పరిగెత్తుకొచ్చి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా అక్కడున్న వారిని అభ్యర్ధించానని రామ్‌సమ్మి ( Ray Ramsammy )తెలిపాడు.ఈ ఘటన తర్వాతి నుంచి తన ప్రియురాలు షాక్‌లో ఉందని.చీకటి పడితే చాలు భయం భయంగా ఫీల్ అవుతోందని , తనపై మళ్లీ దాడి జరుగుతుందేమోనని భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.డావన్ బోనిల్లాను ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించినప్పటికీ.
జూన్ 24న అతనిని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.అతని తదుపరి విచారణను శుక్రవారానికి షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.