లాస్ వెగాస్‌లో వాటర్ బాటిల్ ధర అక్షరాలా రూ.1,200.. చూసి షాకైన ఇండియన్..

కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా పెద్ద హోటళ్లలో సాధారణ వస్తువులకు కూడా అధిక ధరలు పెడతారు.ఉదాహరణకు, ఒక చిన్న నీటి బాటిల్‌కు( Water Bottle ) కూడా వందల రూపాయలు వసూలు చేస్తారు.

 Indian Content Creator Shocked By Rs 1200 Water Bottle At Las Vegas Caesars Pala-TeluguStop.com

ఇలాంటిదే లాస్‌వేగాస్‌లో( Las Vegas ) జరిగింది.ఒక ఇండియన్ లాస్‌వేగాస్‌లోని ఒక హోటల్‌లో 200 మిల్లీలీటర్ల నీటి బాటిల్‌కు 1200 రూపాయలు అడిగారని చెప్పి ఆశ్చర్యపోయాడు.

ఎక్కడబడితే అక్కడ దొరికే మామూలు వాటర్‌ను 1200 అమ్మటం చాలా అన్యాయం అని అతను వాపోయాడు.తన అనుభవాన్ని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పంచుకుంటూ, భారతదేశంలోని తాజ్ హోటళ్లలో ఎన్నో ఉచిత వస్తువులు ఇస్తారని, ఆ హోటళ్ల సేవలకు అలవాటుపడిపోయానని చెప్పాడు

ఈ ఇండియన్ ఒక యూట్యూబర్.అతను అమెరికా హోటళ్ల( America Hotels ) గురించి చెప్తూ, “నాకు అత్యంత ఆశ్చర్యంగా ఉన్న విషయం అమెరికా హోటళ్ల ఆతిథ్యం.వాళ్ళకు అసలు ఆతిథ్యం అంటే ఏంటో తెలియదు.

టిప్స్ ఇవ్వమని అడుగుతారు కానీ, ఉచిత నీళ్లు కూడా ఇవ్వరు.నేను 3 స్టార్, 4 స్టార్ హోటల్స్ లో ఉన్నాను.

ఇవాళ 5 స్టార్ “సీజర్స్ ప్యాలెస్”( Caesars Palace ) హోటల్‌లో కూడా ఉండి వచ్చాను.కానీ బ్యాగేజీ హెల్ప్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు.

ఫ్లైట్ తర్వాత అలసిపోయి ఉదయం 2 గంటలకు హోటల్‌కు వెళ్లి ఒక గ్లాస్ నీరు అడిగితే, ‘ఒక చిన్న బాటిల్ నీరు 1200 రూపాయలు. మీరు కొనుక్కోవచ్చు’ అని చెప్పారు.

ఇది రాత్రికి 200 డాలర్లు వసూలు చేసే హోటల్.వాళ్లకు మన పరిస్థితి మీద కొంచెం కూడా జాలి లేదు.

నమ్మశక్యం కాని విషయం.ఇలాంటిది నేను ఎప్పుడూ అనుకోలేదు” అని రాశాడు.

ఒక వ్యక్తి ఈ పోస్ట్‌కి స్పందిస్తూ, ‘భారతీయ ఆతిథ్య ప్రమాణాలు అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి.భారతీయ బ్రాండ్లు ఈ రంగంలో అగ్రగామిగా ఉంటాయి.మనం ఈ రంగంలో వరల్డ్ లీడర్స్’ అని కామెంట్ చేశాడు.మరొకరు, ‘అమెరికన్లు ఆతిథ్యం కోసం ఆసియాకు వస్తారు.దక్షిణ-ఆసియా, భారతదేశంలో మీకు మంచి సౌకర్యాలు లభిస్తాయి.ఇది తాజ్‌కు మాత్రమే పరిమితం కాదు’ అని పంచుకున్నారు.

అమెరికన్ హోటళ్లలో మీరు ట్యాప్ వాటర్ తాగవచ్చని మరి కొంతమంది సూచించారు.ఈ రుచి ఏరియాలలో పిచ్చి గడ్డి కూడా బంగారం అవుతుందేమో అని మరి కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube