గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.
ఇటీవలి నాగచైతన్య హీరోయిన్ శోభితతో( Sobhita ) ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకున్న విషయం తెలిసిందే.మొదటినుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి కావడంతో మొదట అభిమానులు సెలబ్రెటీలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత కొత్త దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.ఇక ఆపట్నుంచి వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఈ విషయంలోకి సమంతని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు.
నాగచైతన్య ఎంగేజ్మెంట్ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించడంతో పాటు ఎంగేజ్మెంట్ తర్వాత చైతన్య సంతోషంగా ఉన్నాడు అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే చైతూకు ఎంగేజ్‌మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంత( Samantha ) పైనే పడింది.చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కానీ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.
అయితే ఈ సంగతి అటు ఉంచితే తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి.అదేమిటంటే.సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో( Raj Nidimoru ) ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు.
ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది.అయితే సమంత, రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
ఇదివరకు చాలాసార్లు వినిపించిన, నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి.
రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు.
కాగా ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.మరి ఈ వార్తపై సమంత అలాగే రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.కానీ ఒక వర్గం ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మరి కొంతమంది ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.