ఆ వ్యక్తితో సమంత డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం.. ఆ డైరెక్టర్ ఎవరంటే?

గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఇటీవలి నాగచైతన్య హీరోయిన్ శోభితతో( Sobhita ) ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకున్న విషయం తెలిసిందే.

మొదటినుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి కావడంతో మొదట అభిమానులు సెలబ్రెటీలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత కొత్త దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.ఇక ఆపట్నుంచి వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఈ విషయంలోకి సమంతని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు.

"""/" / నాగచైతన్య ఎంగేజ్మెంట్ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించడంతో పాటు ఎంగేజ్మెంట్ తర్వాత చైతన్య సంతోషంగా ఉన్నాడు అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే చైతూకు ఎంగేజ్‌మెంట్‌ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంత( Samantha ) పైనే పడింది.

చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.అయితే ఈ సంగతి అటు ఉంచితే తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి.

అదేమిటంటే.సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

"""/" / బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో( Raj Nidimoru ) ఆమె డేటింగ్‌ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు.

ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది.అయితే సమంత, రాజ్‌ నిడిమోరుపై వస్తున్న రూమర్స్‌ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఇదివరకు చాలాసార్లు వినిపించిన, నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి.

రెండు వెబ్‌ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు.

కాగా ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.మరి ఈ వార్తపై సమంత అలాగే రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

కానీ ఒక వర్గం ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మరి కొంతమంది ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

విడాకులు తీసుకోబోతున్న శర్వానంద్… ఇది మామూలు ట్విస్ట్ కాదుగా?