2001 సెప్టెంబర్ 11న, అమెరికా( America )లోని పెంటగాన్ ప్రభుత్వ భవనం, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లపై ఉగ్రవాదులు దాడి సంగతి తెలిసిందే.ఈ దాడి ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు.
ఈ దాడిలో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే, ఈ ఘటన జరిగి చాలా సంవత్సరాల తర్వాత, కేడ్ అనే మూడేళ్ల బాలుడు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు.
తాను పెంటగాన్ లేదా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లలో ఓ భవనంలో పని చేస్తుండగా దాడి జరిగిందని అప్పుడే అని చనిపోయానని మళ్లీ ఇప్పుడు పునర్జన్మ ఎత్తానని అంటున్నాడు.తాను చనిపోయిన ఆ భవనం నుండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపించేదని చెప్పాడు.
కేడ్ చాలా చిన్న వయసు నుండే తెలివిగా ఉండేవాడు, నడవడం త్వరగా నేర్చుకున్నాడు, రెండేళ్ల వయసులోనే స్పష్టంగా మాట్లాడేవాడు. కేడ్ తల్లి మాలి ఈ చిన్నారి గురించి చెప్పింది.
కేడ్ రాత్రిళ్లు నిద్రలేచి ఏడుస్తూ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపించే ఒక ఎత్తైన భవనంలో పని చేస్తున్నట్లు చెప్పేవాడట.అంతేకాకుండా, మూడేళ్ల వయసులోనే ఆ భవనంతో పాటు కింద పడి చనిపోయినట్లు కల వచ్చిందని తెలిపింది.
మాలికి ఈ విషయం చాలా ఆశ్చర్యంగా అనిపించింది.కేడ్ ఎలా ఈ విషయాలు తెలుసుకున్నాడో అని ఆమె ఆలోచించింది.రిక్ అనే మరొక వ్యక్తి మాట్లాడుతూ కేడ్ ఎక్కడా చదువుకోక ముందే ఈ విషయాలు చెప్పడం ప్రారంభించాడని చెప్పాడు.
చిన్నారి కేడ్ ( Cade )ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఒక పెద్ద భవనాన్ని విమానం ఢీకొట్టింది, అది పేలింది, తాను కింద పడ్డాను అని చెప్పాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానం ఢీకొట్టిన దృశ్యం తనకు గుర్తుందని, తాను కింద పడుతున్నప్పుడు కూలిన భవనాల ముక్కలు తనపై పడ్డాయని, తాను చనిపోయానని చెప్పాడు.కేడ్ సాధారణ పిల్లవాడిలా ఉండాలని, నవ్వాలని మాలి కోరుకుంది కానీ ఇప్పుడు ఆమె తన పిల్లవాడు విచిత్రంగా ప్రవర్తించడం చూసి కొద్దిగా ఆందోళనకు గురవుతోంది.