ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం మొదలైనట్టుగానే కనిపిస్తోంది.ఆ పార్టీలోని కీలక నాయకులనుకున్నవారు చాలామంది ఇప్పటికే పార్టీ మారగా, మరి కొంతమంది పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
మరి కొంత మంది తమ నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ ప్రస్తుత రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరిస్తూ, టిడిపి పైన , ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడిన నేతలను ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకోవడంతో , ఒక్కో నేత జైలు పాలు అవుతున్నారు.
ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు అరెస్ట్ కాగా, నిన్ననే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
![Telugu Acbarest, Ap, Chandrababu, Janasena, Jogi Ramesh, Kodali Nani, Ysrcp-Poli Telugu Acbarest, Ap, Chandrababu, Janasena, Jogi Ramesh, Kodali Nani, Ysrcp-Poli](https://telugustop.com/wp-content/uploads/2024/08/Ysrcp-TDP-janasena-BJP-Jogi-Ramesh-jogi-Rajeev-jogi-Ramesh-kodali-Nani.jpg)
.గత వైసిపి ప్రభుత్వం చంద్రబాబు( Chandrababu Naidu ) ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు. చంద్రబాబు ఇంటి మీద దాడి ఘటన తరువాతనే జోగి రమేష్( Jogi Ramesh ) కు మంత్రి పదవి లభించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది .అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తో పాటు , జోగి రమేష్ బాబాయ్ కూడా ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలతో జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోను జోగి రమేష్ కు తాడేపల్లి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం పోలీసులు ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
దీంతో ఈ వ్యవహారంలో జోగి రమేష్ కూడా అరెస్టు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
![Telugu Acbarest, Ap, Chandrababu, Janasena, Jogi Ramesh, Kodali Nani, Ysrcp-Poli Telugu Acbarest, Ap, Chandrababu, Janasena, Jogi Ramesh, Kodali Nani, Ysrcp-Poli](https://telugustop.com/wp-content/uploads/2024/08/kodali-Nani-vellampalli-srinivasarao-vallabaneni-vamsi-ap-politics-ACB-arest-Jogi-Rajeev-CBN-Chandrababu.jpg)
దీంతో జోగి రమేష్ తర్వాత ఎవరిని టిడిపి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకోబోతోంది అనే టెన్షన్ వైసీపీ నేతల్లో తీవ్రం అయింది. ముఖ్యంగా కృష్ణా జల్లా వైసిపి నేతల్లో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. గత వైసిపి ప్రభుత్వం లో టిడిపిని, చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన వారిలో కీలకంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే వీరిపై కేసులు నమోదు కావడంతో నెక్స్ట్ టార్గెట్ వీరిలో ఒకరనే ప్రచారం మొదలైంది.