వీడియో: కదులుతున్న ట్రక్కు వెనుక డేంజరస్ స్టంట్ చేసిన యువకులు.. చివరికి..?

బంగ్లాదేశ్‌ ( Bangladesh )రాజధాని ఢాకా( Dhaka )లో ఇద్దరు బాలురు చేసిన ఓ ప్రాణాంతక స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో, వేగంగా వెళ్తున్న ట్రక్కు వెనుకాల వస్తూ స్కేట్‌బోర్డు మీద ఇద్దరు బాలురు స్టంట్స్‌ చేశారు ప్రమాదం జరుగుతుందనే ఎలాంటి భయం లేకుండా వాళ్లు రెచ్చిపోయారు.

 Video: Teens Perform Dangerous Stunt Behind Moving Truck In The End, Bangladesh-TeluguStop.com

ఈ 16 సెకన్ల వీడియోను జర్నలిస్ట్ నిశాంత్ శర్మ పంచుకున్నారు.ఈ వీడియోలో, బాలురు ట్రక్కు వెనుకాల స్కేట్‌బోర్డు మీద వేగంగా వెళ్తున్నారు.

ట్రక్కు వెనకాల పట్టుకుని దానికి వేలాడుతూ కొంత దూరం కూడా వెళ్లారు ఆ తర్వాత దాని పక్క నుంచి స్కేట్ బోర్డుపై స్పీడ్ గా వెళ్లారు.రద్దీగా ఉన్న రోడ్డు మీద ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం చాలా ప్రమాదకరం.

ఒక యువకుడు ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తుండగా, మరొక యువకుడు తన మొబైల్ ఫోన్‌తో దాన్ని రికార్డ్ చేస్తున్నాడు.కొంత సమయానికి, ఒక బాలుడు ట్రక్కు నుంచి దూరంగా స్కేట్‌బోర్డు మీద వెళ్లడానికి ప్రయత్నించాడు.

ఇద్దరూ కూడా సేఫ్టీ గేర్స్‌ ధరించలేదు.ఈ వీడియోను బిజయ్ సరణి మెట్రో స్టేషన్ దగ్గర చిత్రీకరించారు.

జర్నలిస్ట్ నిశాంత్ శర్మ( Journalist Nishant Sharma ) ఈ వీడియోను పంచుకుంటూ “అతను ట్రక్కు కింద చిక్కుకుపోయి ఉంటే… అప్పుడు అతని కుటుంబం ట్రక్కు యజమానిపై కేసు పెట్టేది.అతని శరీరం ఏ ఒక్క భాగాన్ని కూడా అతని కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయేవారు.ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.వారిపై చర్య తీసుకోవాలి!” అని రాశారు.

ఈ ఆశ్చర్యకరమైన స్టంట్ సోషల్ మీడియా( Social media )లో చాలా వైరల్ అయింది.ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా చూశారు.దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ యువకులు చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టారు.ఈ పనుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు అని చెప్పారు.రీల్స్, షార్ట్ వీడియోస్ బ్యాన్ చేయాలని కొందరు కోరారు.

పిల్లలు ఎలా చెడిపోతుంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారని మరికొందరు మండిపడ్డారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube