నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనందరికీ తెలిసిందే.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 Mega Star Chiranjeevi Request To Stop Indra Movie Rerelease Details, Chiranjeevi-TeluguStop.com

సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు ఎప్పుడు ఆపద్బాంధవుడిలా, పెద్దన్నయ్యలా ముందు ఉంటూ ఆదుకుంటూ ఉంటారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించే చిరంజీవి చిత్ర సీమ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటారు.

Telugu Ashwini Dutt, Chiranjeevi, Indra, Tollywood-Movie

ఇక చిన్న సినిమాలను కొత్త నిర్మాతలను ప్రోత్సహించేందుకు ఆయన తీసుకున్న తాజా నిర్ణయం మెగాస్టార్ గౌరవాన్ని మరింత పెంచింది.చిన్న సినిమాలకు ఊపిరిపోస్తూ చిరు తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌ ప్రశంసలు అందుకుంటోంది.అదేమిటంటే.

టాలీవుడ్‌ లో ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.వీటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఉంటాయి.

కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో చిన్న సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటారు నిర్మాతలు.( Producers ) పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలకు థియేటర్లు లభించకపోవడం ఒక సమస్య అయితే, అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాల కలెక్షన్లు బాగా తగ్గిపోతాయనే టెన్షన్ ఒకటి.

Telugu Ashwini Dutt, Chiranjeevi, Indra, Tollywood-Movie

ఇక ఈ వారం కూడా ఒక నాలుగు చిన్న సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి.ఇదే సమయంలో పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేకపోవడంతో ఆ సినిమాల నిర్మాతలు సంబరం చేసుకున్నారు.ఇంతలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఇంద్ర రీరిలీజ్‌కు( Indra Rerelease ) నిర్మాత భారీ ఏర్పాట్లు చేయడంతో చిన్న చిత్రాల నిర్మాతలు షాక్‌కు గురయ్యారట.ఇక ఇంద్ర రీరిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి.

చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు.తన సినిమా కోసం చిన్న సినిమాకు రిస్క్‌ లోకి నెట్టొద్దని భావించారట మెగాస్టార్.

ఇంద్ర రీరిలీజ్ చేయకుండా ఆపేయాలని నిర్మాత అశ్వనీదత్‌ను( Ashwini Dutt ) కోరారని టాలీవుడ్‌ టాక్.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర రీరిలీజ్ చేయాలని నిర్ణయించిన నిర్మాత అశ్వనీదత్ మెగాస్టార్ సూచనతో వెనక్కి తగ్గారని సమాచారం.

దీంతో 15వ తేదీన రిలీజ్ అవుతున్న నాలుగు చిన్న సినిమాలు సేఫ్ అయ్యాయని అంటున్నారు.ఇంద్ర రీరిలీజ్‌కు చిరంజీవి ఓకే చెబితే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమయ్యేదని అంటున్నారు.

మొత్తానికి చిరంజీవి మంచి మనసుకు అంతా జేజేలు పలుకుతున్నారు.చిరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube