కెనడా టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్‌పై( Temporary Foreign Worker Program ) కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ .( Immigration Minister Marc Miller ) ఈ ప్రోగ్రామ్ లోపభూయిష్టంగా లేదు కానీ, సంస్కరణ అవసరమన్నారు.
ఈ కార్యక్రమం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి విదేశీయులకు అనుమతిస్తుందని, కార్మికుల కొరతను తీర్చడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని మిల్లర్ తెలిపారు.తక్కువ వేతనాలు, కార్మికులను దుర్వినియోగం చేస్తున్నందున ఈ ప్రోగ్రామ్ విమర్శలకు గురైంది.
తక్కువ వేతనాలతో కూడిన ఈ ఫారిన్ వర్కర్ స్ట్రీమ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉందని మిల్లర్ పేర్కొన్నారు.ఈ ప్రోగ్రామ్ కింద కెనడాకు( Canada ) వస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లుగా మంత్రి చెబుతున్నారు.ఇది 2016లో 15,817 ఉండగా.2023లో 83,654కి పెరిగిందని మిల్లర్ తెలిపారు.ఆధునిక బానిసత్వంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గతవారం ఓ నివేదికను సమర్పించారు.ఇందులో కెనడా తాత్కాలిక విదేశీ వర్కర్ ప్రోగ్రామ్‌ను ప్రస్తావించారు.ఇది సమకాలీన బానిసత్వానికి బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుందన్నారు.
ఈ విధానంలో తక్కువ చెల్లింపులు, శ్రమ దోపిడీ వంటివి ఉన్నాయని.ఆరోగ్య సంరక్షణ కోసం కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని నివేదిక తెలిపింది.కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోందని.
కానీ ఈ వలసదారులకు హాని కలిగించే సమస్యలను మాత్రం పరిష్కరించదని నివేదిక పేర్కొంది.కార్మికులకు శాశ్వత నివాసానికి తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా తాత్కాలిక విదేశీ కార్మికులకు( Foreign Workers ) నిర్మాణాత్మక అస్థిరత తగ్గించబడుతుందని సూచించింది.
అయితే మార్క్ మిల్లర్ ఈ బానిసత్వ లక్షణాలను ఇన్ఫ్లమేటరీగా అభివర్ణించారు.దేశంలో గృహ సంక్షోభం, ఆర్ధిక పరిస్ధితులు, దేశ ప్రజల్లో పెరుగుతోన్న వలస వ్యతిరేక సెంటిమెంట్ నేపథ్యంలో పరిస్ధితిని గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ వలసలు, విద్యార్ధి వీసాలపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.