వీడియో: రీల్స్‌ చేస్తూ 6వ అంతస్తు నుంచి కింద పడిన బాలిక..

రీల్స్( reels ) మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కొందరు తీవ్ర గాయలపాలై ఆసుపత్రిలో పడుతున్నారు.

 Video: Girl Fell Down From 6th Floor Doing Reels.. Tragic Incident, Teenager Gi-TeluguStop.com

తాజాగా మోనిష (16) అనే యువతి రీల్స్‌ వీడియో తీస్తుండగా 6వ అంతస్తు నుంచి కింద పడిపోయింది.ఈ విషాద సంఘటనలో మోనిషకు కాలు విరిగింది.

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ బాలిక ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఘజియాబాద్‌ సిటీ, ఇందిరాపురం ప్రాంతంలోని క్లౌడ్-9 సొసైటీలో నివసిస్తోంది.ఈ ఘటన గురించి పోలీసులు మీడియాకి వివరాలు తెలిపారు.“ఘజియాబాద్‌( Ghaziabad )లోని ఇందిరాపురం ప్రాంతంలో నివసించే మోనిష తన మొబైల్ ఫోన్‌తో రీల్స్ తీస్తుండగా బ్యాలెన్స్ కోల్పోయి, బాల్కనీ నుంచి కింద పడిపోయింది.ఆరు అంతస్తుల ఎత్తు నుండి కింద పడినా, గ్రౌండ్ ఫ్లోర్‌లో పెద్ద మొక్క ఉన్న కుండీపై పడినందున, గాయాలు తీవ్రంగా కాలేదు.పక్కింటి వారు మోనిషను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమెకు కాలు విరిగింది.ఇతర గాయాలకు కూడా వైద్యులు చికిత్స చేస్తున్నారు.” అని ఇందిరాపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు.

ఆ యువతి నొప్పితో ఏడుస్తూ, తండ్రిని పిలవమని తన తల్లిని అడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో, యువతి నేలపై పడి ఉంది.ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, తీవ్రమైన నొప్పితో ఏడుస్తూ, తన తల్లిని “అమ్మా, నాన్నని పిలవండి” అని అడుగుతుంది.

అదే వీడియోలో, ఆ యువతి తల్లి ఆమెను తిడుతూ, “చాలా బ్యాడ్ గర్ల్,, మా పేరును చెడగొడుతుంది” అని అంటూ ఉంది.

అంటే, ఆ యువతి తల్లి, తన కూతురు రీల్స్ తీయడానికి అతిగా మక్కువ చూపిస్తుందని, అలా చేయడం వల్ల తమ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పింది.ఈ వీడియోలో ఆ యువతి దయనీయ పరిస్థితిని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube