సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ టైగర్.
కెరియర్ మొదట్లోనే భారీ సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఆ తర్వాత కొద్దిరోజుల పాటు సక్సెస్ లు లేక కొంతవరకు సతమతమైనప్పటికీ మళ్లీ మంచి కథలను సెలెక్ట్ చేసుకొని హిట్టు ట్రాక్ ఎక్కాడు.
ప్రస్తుతానికి వరుసగా ఆరు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఇప్పుడు దేవర సినిమాతో సక్సెస్ కొడితే వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోగా కూడా తను మంచి గుర్తింపు సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే దేవర తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం లోకేష్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ లేటవుతూ వస్తుంది.ఇక మొత్తానికైతే ఇటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ లోకేష్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది… ఇక వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా పాన్ ఇండియాలో భారీ రికార్డులను కొల్లగొడుతుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక బ్యాక్ టు బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలు చేయడం అనేది ఒక వంతుకు మంచి విషయమే అయినప్పటికీ ఈ సినిమాలతో విజయాలను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.