ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండడంతో బీఆర్ఎస్ నుంచి చాలామంది కీలక నేతలే ఆయా పార్టీల్లో చేరిపోయారు .
ఎక్కువగా కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ కేడర్ చేరేందుకు మొగ్గు చూపిస్తుండడం వంటివి బిఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తున్నాయి.రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా పేరుపొందిన కేసీఆర్ ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి ఏమి వర్కౌట్ కావడం లేదు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన ఎంతోమంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయినా , ఆ వలసలను ఆపడంలో కెసిఆర్( KCR ) విఫలం అవుతున్నారనే విమర్శలు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి .తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం వంటివన్నీ కేసిఆర్ రాజకీయ వ్యవహాలపై కేడర్ లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నారు. తమిళనాడు రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్ నేతలతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని తమిళనాడుకు పంపించినట్లు సమాచారం.అక్కడ డిఎంకె పార్టీ బలోపేతం కోసం తీసుకున్న చర్యలు, పార్టీ అగ్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకే ప్రత్యేక బృందం ను తమిళనాడుకు పంపించారట. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది.అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనైనా గెలుస్తూనే వస్తుంది.శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థ ల ఎన్నికల్లో డీఎంకే( DMK party ) విజయం సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుకుంది.
దీంతో డిఎంకె పార్టీ విధానాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు, అక్కడి విధానాలు వ్యవహారాలను తెలంగాణలోనూ అమలు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి వలసలను నివారించే దిశగా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తమిళనాడు తెలంగాణ భిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి తమిళనాడులో ప్రతిపక్షం బలంగా లేకపోవడం వల్లే డీఎంకే వరుసగా విజయాలు దక్కుతున్నాయి కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేకపోవడంతో కెసిఆర్ తాజా నిర్ణయం పై అనేక సందేహాలు నెలకొన్నాయి.