టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) పూర్తిగా మారిపోయారు.గతంలో మాదిరిగా మొహమాటలను పక్కనపెట్టి ముక్కు సూటిగా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర నుంచి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ సీనియర్ నేతలకు పెద్ద షాక్ నే ఇస్తున్నాయి.ఎన్నికల సమయంలో టికెట్లు కేటాయింపు విషయంలో సీనియర్ నేతలను చాలా వరకు చంద్రబాబు పక్కన పెట్టారు.
యువ నాయకులకు ఎక్కువ టికెట్లు కేటాయించారు. సుదీర్ఘకాలం పార్టీలో ఉంటూ వరుసగా అన్ని ఎన్నికల్లోను పోటీ చేస్తున్న నాయకులను సైతం తప్పించారు .తమకు టిక్కెట్ ఖాయమని , పార్టీ గెలిస్తే మంత్రి పదవి తమకే వస్తుంది అని ఆశలు పెట్టుకున్న చాలామంది సీనియర్ నేతలకు సైతం టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు.
కేవలం పార్టీ కార్యక్రమాలు, పార్టీ పదవులకే వారిని పరిమితం చేసే విధంగా చంద్రబాబు నిర్ణయించుకున్నారు .అలాగే త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులలోను దాదాపు 90 శాతం యువ నాయకులకే కేటాయించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించుకున్నారట.త్వరలో నామినేటెడ్ పోస్టులను బట్టి చేయబోతుండడంతో , ముందుగానే సీనియర్లకు సంకేతాలు పంపిస్తున్నారట .పార్టీ కోసం గత ఐదేళ్లు కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామనే సంకేతాలు పంపిస్తున్నారట. గతంలో చంద్రబాబు చుట్టూ సీనియర్ నేతలే ఉండేవారు.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట వారే ఉండేవారు. అయితే ఇప్పుడు యువ నాయకులకు చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
ముఖ్యంగా ఢిల్లీలో పార్టీ తరఫున అన్ని వ్యవహారాలను చక్కబెట్టేందుకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్( Galla Jayadev ) ను నియమించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.పార్టీ సీనియర్ నేతలను కేవలం పార్టీ వ్యవహారాలకే పరిమితం చేయాలని, యువ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారు యాక్టివ్ గా జనాల్లోకి వెళ్తారని, మీడియా , సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తారని, నిత్యం జనాల్లో తిరుగుతూ పార్టీకి ప్రభుత్వానికి మేలు కలిగే వ్యవహరిస్తారని , సీనియర్ నేతలకు ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా వారు జనాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడరని, ఇల్లు కార్యాలయాలకే పరిమితం అవుతారని , ఆ తరహా రాజకీయం ఇప్పుడు వర్కౌట్ కాదనే ఉద్దేశంతోనే చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారట.