తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )కి ఉన్న గుర్తింపు అయితే మరే దర్శకుడికి ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాలు ఆయన తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కమర్షియల్ జానర్లోనే ఉండటమే కాకుండా ఆయా హీరోని చాలా వరకు ఎలివేట్ చేస్తూ ఉంటాయి.
అందువల్లే ఆయన సినిమాల్లో హీరో ఒక డిఫరెంట్ మేనరిజంతో మాడ్యులేషన్స్ తో కనిపిస్తూ ఉంటాడు.
అందుకే ఎన్ని సంవత్సరాలైనా ఆయన సినిమాల్లోని హీరోలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.ఇక రవితేజ, మహేష్ బాబు( Ravi Teja, Mahesh Babu ) లాంటి హీరోలను స్టార్లుగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.ఇక మొత్తానికైతే ఆయన చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double iSmart ) తర్వాత మరొక సినిమాకి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన తెలుగులో ఉన్న ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ హీరో ఎవరు అనే దానిమీద ఇంకా సరైన క్లారిటీ రాలేదు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోకి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక వీళ్ళ ఆ భారీ హీరోతో ఒక గొప్ప చిత్రం అయితే రాబోతుంది అనే వార్తలు కూడా ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటే కొంతమంది బాలయ్య బాబు పేరు చెబుతున్నారు.అలాగే మరి కొంతమంది వెంకటేష్ పేరు కూడా చెబుతున్నారు.
మరి వీళ్ళిద్దరిలో ఆయన ఏ హీరో తో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే పూరి నెక్స్ట్ సినిమాను మన తెలుగు హీరోలతోనే చేస్తుండటం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…