నాని హ్యాట్రిక్ విజయాలను సాధిస్తాడా..? 'సరిపోదా శనివారం' సినిమా పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో వరుస సాకేస్ లను అందుకోవడం లో కొంతమంది హీరోలు ఫెయిల్ అవుతూ ఉంటారు.

 Will Nani Achieve A Hat-trick Of Victories What Is The Condition Of The Movie 's-TeluguStop.com

మరి కొంత మంది మాత్రం వాళ్లు చేసే సినిమాలా కథల ఎంపికలో జాగ్రత్తలను తీసుకొని మంచి విజయాలు సాధిస్తూ సూపర్ సక్సెస్ ఫుల్ గా ఎదుగుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే నాని( Nani ) లాంటి స్టార్ హీరో సైతం చాలా మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మినిమం గ్యారెంటీగా ఉంటుందన్న గుర్తింపు ను సంపాదించుకున్నాడు అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు… ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ), డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న నాని ఇప్పుడు ‘సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.ఇక రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం ఒకసారి చూసినట్టయితే అందులో నాని తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా తెలుస్తుంది.

 Will Nani Achieve A Hat-trick Of Victories What Is The Condition Of The Movie 'S-TeluguStop.com

ఇక ఆగస్టు 28 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నాని ఖాతాలో మరొక సక్సెస్ పడబోతుంది అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఇంతకుముందు గత సంవత్సరంలో దసరా, హాయ్ నాన్న సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సంవత్సరంలో కూడా సక్సెస్ కొట్టి వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube