విజయ్ సక్సెస్ సాధిస్తే ఏపీ వరకు రీసౌండ్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్( Dalapathy Vijay ) గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

 Naga Chaitanya About Thalapathy Vijay The Goat Movie, Naga Chaitanya, Thalapathy-TeluguStop.com

ప్రస్తుతం విజయ్ ది గోట్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.వెంకట్ ప్రభు ( Venkat Prabhu )ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ గా నటిస్తోంది.సెప్టెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

Telugu Goat, Naga Chaitanya, Nagachaitanya, Tollywood-Movie

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై అక్కినేని నాగచైతన్య చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా చెన్నైలో( Chennai ) జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్‌కి హాజరైన చైతూ విజయ్ సినిమా గురించి మాట్లాడారు.నాగ చైతన్య స్టేజ్ మీదకి రాగానే విజయ్ ది గోట్ సినిమాలో ( The Goat )పోస్టర్ స్క్రీన్ మీద వేసి దీని గురించి ఏమంటారు అంటూ యాంకర్ అడగగా.

కస్టడీ సినిమా షూటింగ్ సమయంలో ది గోట్ చిత్రం స్టోరీ లైన్ గురించి వెంకట్ ప్రభు నాతో చెప్పారు.ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

అది గ్యారెంటీ.

Telugu Goat, Naga Chaitanya, Nagachaitanya, Tollywood-Movie

ఆయనతో కలిసి పని చేయడం చాలా గొప్పగా అనిపించింది.విజయ్ సార్ సినిమా హిట్టు అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు.తమిళనాడు నుంచి ఆంధ్ర వరకూ రీసౌండ్ వస్తుంది అని నాగ చైతన్య తెలిపారు.

ఇక ఈ వీడియోను చైతూ ఫ్యాన్స్ హ్యాండిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా విజయ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.ఇకపోతే నాగచైతన్య విషయానికి వస్తే.తాజాగా చైతన్య నటి శోబిత తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఇక చైతన్య కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు.

చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube