టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ఆయన ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలతో ఫ్యామిలీతో కలిసి తగిన సమయాన్ని కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు అయిన ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళుతూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మహేష్ బాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కూతురు సితార( Gautham, Sitara )తో కలిసి తాజాగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.
అలాగే వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.అంతకుముందు అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోలను సోషల్ వీడియోలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి( SS Rajamouli ) డైరక్షన్‌లో సినిమా చేయనున్నారు.ఇప్పటికే కథను సిద్ధం చేయగా షూటింగ్‌కు సంబంధించి ఇంకా అప్‌డేట్ రావాల్సి ఉంది.
అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.ఈ చిత్రానికి మహారాజ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపంలో బిజీ బిజీగా ఉన్నారు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్లు రానున్నాయి.మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.