భారత దేశంలో ఆడవారికి రక్షణ అనేది లేకుండా పోతోంది.ఉత్తర భారతదేశంతో పాటు కొన్ని దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో కూడా ఆడవారిపై దాడులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.
కామాంధులు చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ఎవరినీ వదలకుండా రేప్‌లు చేస్తున్నారు.అంతే కాదు వారిని అత్యంత దారుణంగా చంపేస్తున్నారు.
బయటికి వస్తే చాలు ఈ నీచులు అమ్మాయిల వెంట పడుతూ వారిని వేధిస్తున్నారు కూడా.అయితే కొంతమంది అమ్మాయిలు ధైర్యం చేసి వీళ్లకు బుద్ధి చెబుతున్నారు.
తాజాగా గుజరాత్‌లోని ( Gujarat ) ఇద్దరు స్కూల్ అమ్మాయిలను ఒక కామాంధుడిని నడిరోడ్డుపై పడేసి వీర కొట్టుడు కొట్టారు.
అతడు రోజు వీరి వెంట పడుతూ హింసిస్తున్నాడు.
ప్రేమించాలంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.అయితే అతడికి ఈ విద్యార్థినులు భయపడలేదు.
ఆ అమ్మాయిలు ఆ వ్యక్తిని బెల్టుతో( Belt ) కొట్టి శిక్షించారు.ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియో చాలా మందికి చేరింది.ఈ అమ్మాయిల ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
వైరల్ వీడియోలో ఒక యువకుడు రోడ్డు మీద పడుకుని ఉన్నాడు.అతన్ని ఇద్దరు స్కూల్ అమ్మాయిలు( School Girls ) బెల్టుతో కొడుతున్నారు.ఈ వీడియోను “చేసర్” అనే ఖాతా X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.అమ్మాయిలు ఆ వ్యక్తిని కొడుతూ అతను తప్పు చేశాడని చాలా కోపంగా అంటున్నారు.
ఆ వ్యక్తి తన ముఖాన్ని చేతులతో కప్పుకుని ఉన్నాడు.అతను ఇబ్బంది పడుతున్నాడో లేదా భయపడుతున్నాడో తెలియదు కానీ ఆ అమ్మాయిలు మాత్రం అతడికి బాగానే బుద్ధి చెప్పారు.
ఈ అమ్మాయిలకు సపోర్టుగా కొంతమంది స్థానికులు కూడా ముందుకు వచ్చారు ముఖం చూపించమని చేతులు పక్కకి తీసే ప్రయత్నం చేశాడు కానీ అతని మాత్రం తన ముఖం కప్పుకున్నాడు.
అమ్మాయిలను ఏడిపించినప్పుడు ఇలా జరుగుతుందని, పరువు పోతుందని ఇతడికి తెలియదా? ఇలాంటి వారిని రోడ్లపై తిరగనివ్వకుండా పోలీసులు కఠినంగా శిక్షించాలి.ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి, దీన్ని చాలా మంది చూశారు.కొంతమంది ఆ అమ్మాయిలు చేసిన పని సరైనదే అని అన్నారు.
ఒకరు, “అతనికి అలానే శిక్ష విధించాలి” అని అన్నారు.మరొకరు, “అహ్మదాబాద్‌లోని( Ahmedabad ) విద్యార్థినులు ఒక వేధింపు చేసే వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్నారు.
ఇదే మంచి మార్గం.మహిళలు తమ భద్రతను తామే కాపాడుకోవాలి” అని అన్నారు.
మరొకరు, “బెల్టుతో కొట్టడం, చెప్పుతో కొట్టడం సరైన శిక్ష” అని చెప్పారు.