మూవీ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను వేరే లాంగ్వేజ్‌లో రీమేక్ తీయడం కామన్.సాధారణంగా రీమేక్ అనేది ఒరిజినల్ అంత గొప్పగా ఉండదు.
అయినా ప్రూవ్డ్ సబ్జెక్టు కాబట్టి ఎలాగోలా హిట్స్ సాధిస్తుంటాయి.కొన్నిసార్లు మాత్రం ఫ్లాప్ అవుతుంటాయి.
అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం ఒరిజినల్ కంటే రీమేకే బాగా తీస్తుంటారు.ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ అద్భుతంగా రూపొందించాలంటే చాలా గొప్ప టాలెంట్ ఉండాల్సిన ఉంటుంది.
అలాంటి డైరెక్టర్లలో రవిరాజా పినిశెట్టి( Raviraja Pinishetti ) ఒకరు.కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, పెదరాయుడు, మా అన్నయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రీమేక్ సినిమాలను తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు రవిరాజా పినిశెట్టి.
రవిరాజా పినిశెట్టి తీసిన “చంటి” మూవీ( “Chanti” movie ) కూడా చాలా పెద్ద హిట్ సాధించింది.ఈ సినిమా తమిళ రొమాంటిక్ మ్యూజికల్ ఫిలిం “చిన్న తంబి”కి రీమేక్.
ఒరిజినల్ సినిమాని పి.వాసు ( P.Vasu )డైరెక్ట్ చేశాడు.ప్రభు హీరోగా వచ్చిన ఈ తమిళ మూవీ 9 స్క్రీన్లలో 356 రోజులు, 47 స్క్రీన్‌లలో 100 రోజుల ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అయితే రవిరాజా పినిశెట్టి తెలుగు రీమేక్‌ని దీని కంటే పెద్ద హిట్ చేశాడు.తెలుగు రీమేక్ అయిన చంటి బాక్సాఫీస్ వద్ద “ఇండస్ట్రీ హిట్”గా నిలిచింది.
ఇది 40 కంటే ఎక్కువ డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది.నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది.32 ఏళ్ల క్రితమే ఈ సినిమా 16 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసింది.ఈ రికార్డ్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్‌యే చంటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పకనే చెబుతున్నాయి.
ఒక జమిందారీ కూతురుతో బంగారం లాంటి మనసున్న ఒక పేదవాడు, ఓ అమాయకుడు ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడమే ఈ మూవీ కథాంశం.
ఈ మూవీలో ఆ అమాయకుడిగా విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) నటించాడు.అతను పోషించిన పాత్ర చంటి.చంటి ప్రియురాలి నందిగా మీనా( Meena ) యాక్ట్ చేసింది.
చంటి క్యారెక్టర్ లో వెంకటేష్ ను తప్ప వేరే హీరోను ఊహించలేం.అతడు అంత బాగా నటించాడు.
అందుకే హిందీలో రీమేక్ చేసినా వెంకటేష్ నే హీరోగా తీసుకున్నారు.వెంకటేష్ మినహా ఈ క్యారెక్టర్ మరెవరూ చేయలేరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ హిందీ రీమేక్ పేరు “అనారి”.ఒరిజినల్ తెలుగు సినిమాలో నటించినందుకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు వెంకటేష్.
ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా నంది అవార్డు అందుకున్నారు.ఇళయరాజా కంపోజ్ చేసిన చంటి మూవీలోని పాటలు ఈ రోజుకూ చాలా మంది వింటుంటారు.
ఈ క్లాసిక్ హిట్ సినిమా అందరూ ఒక్కసారైనా తప్పక చూడాలి.