యువకుడు పామును చంపి దానిని ఒక కవర్ లో కట్టేశాడు.అయితే ఆ పాము చనిపోకముందు అతడిని కాటేసింది.
దాంతో అతడు కోపం తెచ్చుకొని దానిని చంపేశాడు.అయితే.
చికిత్స కోసం వెళితే తనను ఏ పాము కరిచిందో డాక్టర్ అడుగుతారని, అందుకే చూపించడానికి దీన్ని వెంట తెచ్చుకున్నానని చెప్పాడు.ఇది యాంటీ వెనమ్‌ని( Anti-venom ) అప్లై చేయడం నాకు సులభతరం చేస్తుందని అతడు చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని చందౌలీలో ( Chandauli, Uttar Pradesh )చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.
చందౌలీ ప్రధాన కార్యాలయంలో ఉన్న కమలపతి జిల్లా ఉమ్మడి ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో భయానక పరిస్థితి నెలకొంది.ఓ ప్లాస్టిక్ కవర్లో చనిపోయిన పాముతో ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు.పాము కనిపించిన వెంటనే తీవ్ర భయాందోళనలకు గురయ్యారు అక్కడి స్టాఫ్ నర్సులు, ఇతరులు.దాంతో అక్కడినుండి చాలామంది పారిపోయారు.అనంతరం పామును బయటకు విసిరి చికిత్స అందించారు.బలువా పోలీస్ స్టేషన్ ( Balua Police Station )పరిధిలోని నౌదర్ గ్రామానికి చెందిన ఫర్హాన్ ఖాన్ ( Farhan Khan )అనే వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు.
దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు పామును కూడా చంపి ప్లాస్టిక్ కవర్‌తో లో వేసుకొని జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు.వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి పాము కాటుకు గురైందని వైద్యుడికి తెలియజేయగా.
పాము గురించి ఏమీ చెప్పకుండా.చనిపోయిన పాము ఉన్న బ్యాగ్‌ను చూపించాడు.
దాంతో పాము కనిపించిన వెంటనే వైద్య సిబ్బందిలో భయాందోళన నెలకొంది.తాను ఇంటి ప్రాంగణంలో నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా పాము యువకుడిని కాటేసిందని ఫర్హాన్ చెప్పాడు.ఆగ్రహించిన ఫర్హాన్ పామును చంపేశాడు.ఏ పాము కరిచిందో చెప్పేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాడు.ఈ గాహ్తనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.