వాళ్లకు దూరంగా ఉండండి.. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు ఇండియన్ కాన్సులేట్ హెచ్చరిక

అమెరికా ( America )వెళ్లి లక్షలాది రూపాయలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు.అన్ని దేశాలకు చెందిన వారు అమెరికా వెళ్లేందుకు పోటీపడుతుండటంతో ఆ దేశ వీసా పొందడం కష్టమైంది.

 Indian Consulate In New York Warns Against Fraudulent Agents , Fraudulent Agents-TeluguStop.com

దీంతో దొడ్డిదారిన వెళ్లే వారి సంఖ్య ఇటీవల పెరిగింది.సరిహద్దులు దాటుతూ చేసే సాహసాలు వారి ప్రాణాల మీదకొస్తున్నాయి.

లేదంటే బోర్డర్ సెక్యూరిటీ ఏజెంట్లకు ( Border Security Agents )చిక్కి జైళ్లలో మగ్గడం నిత్యకృత్యమైంది.దీనికి ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసాలు అదనం.

అమెరికాకు అక్రమ మార్గాల్లో చేరవేరుస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ కొన్ని గ్యాంగ్‌లు జేబులు నింపుకుంటున్నాయి.

Telugu America, Indianconsulate, Indian America, York, Citizen India-Telugu Top

అయితే అమెరికాకు వెళ్లిన వారే కాదు.ఏళ్లుగా అగ్రరాజ్యంలో నివసిస్తూ స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ట్రావెల్ ఏజెంట్ల ఉచ్చులో పడి జేబులు గుల్లచేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ( Indian Consulate in New York )కీలక అడ్వైజరీ జారీ చేసింది.

అమెరికాలోని మోసపూరిత ట్రావెల్ ఏంజెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని .కాన్సుల్ జనరల్ బినయ్ ప్రధాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.అమెరికాలోని ఇండియన్ మిషన్స్ నుంచి పొందే సేవలకు గాను కొందరు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కాన్సుల్ తెలిపింది.

Telugu America, Indianconsulate, Indian America, York, Citizen India-Telugu Top

ప్రధానంగా ఓవర్సీస్ సిటిజన్‌ ఆఫ్ ఇండియా( Overseas Citizen of India ) (ఓసీఐ) కార్డులు, వీసాలు, పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారని హెచ్చరించింది.ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం రాయబార కార్యాలయం నామమాత్రంగా 17 డాలర్లు వసూలు చేస్తుండగా.ఏజెంట్లు మాత్రం 450 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారని తెలిపింది.

అలాగే ఈ తరహా సేవలకు గాను నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారని.ఈ సమాచారాన్ని దరఖాస్తుదారులకు సైతం తెలియజేయడం లేదని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.

వీటి వల్ల బాధితులు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల మోసపూరిత ట్రావెల్ ఏజెంట్లకు దూరంగా ఉండాలని కాన్సుల్ కార్యాలయం హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube