ప్రపంచంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికిన కొన్నింటికి మాత్రం సమాధానాలు ఎప్పటికీ దొరకవు అని చెప్పవచ్చు.అందులో ముఖ్యంగా భూమ్మీద దెయ్యాలు, దేవుళ్ళు ఉన్నారా.? లేదా.? అనే విషయం గురించి కూడా అంతే.కొందరేమో దేవుళ్ళు, దెయ్యాలు రెండు ఉన్నాయని గట్టిగా వాదిస్తుంటే.మరికొందరేమో., ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ లేని వాటిని చాలా సులువుగా కొట్టిపరేస్తుంటారు.దాంతో ఈ విషయం ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే 0 మిగిలిపోయింది.
ఇకపోతే ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల దెయ్యం వీడియోలు చూసాము.ఎంతోమంది భూమిపై దయ్యాలు ఉన్నాయంటూ.
అందుకు సంబంధించిన వీడియోలను రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.ఇకపోతే తాజాగా భారతదేశంలో బస్సులో దెయ్యం ఉందని ఓ వీడియో వైరల్ గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు వెళితే.ఈ వీడియోలో మొదట బస్సులోనే వ్యక్తి బస్సులో ఉన్న కెమెరా స్క్రీన్ ( Camera screen )పై ఓ బస్సులో ఓ వ్యక్తి ఉన్నట్లుగా చూపిస్తాడు.అయితే ఆ తర్వాత అదే సీటు దగ్గరికి వెళ్లి చూడగా.
ఆ సీట్లో ఎవరూ లేకపోవడం కూడా చూపిస్తాడు.మళ్లీ ఆ సీటు నుంచి కెమెరా స్క్రీన్ దగ్గరకి వెళ్లి చూడగా.
అక్కడ మళ్లీ తెల్లచొక్కా వేసుకున్న వ్యక్తి సీటులో కదలకుండా ఉండడం కనిపిస్తుంది.దీంతో ఆ వ్యక్తి బస్సులో దెయ్యం ఉందని చెబుతాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇందులో కొందరు వామ్మో దయ్యాలు ఇప్పుడు మనతోపాటు బస్సులో ప్రయాణం చేస్తున్నాయా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో., ఈ వీడియో కచ్చితంగా ఫేక్ వీడియో అని క్రియేట్ చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.