ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి( Venuswami ) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సమంతకు క్షమాపణలు చెబుతూ వేణుస్వామి ఈ కామెంట్లు చేయడం కొసమెరుపు.
సమంత జాతకం చెప్పడం ద్వారా వేర్వేరు సందర్భాల్లో వేణుస్వామి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.అలా సమంత( Samantha ) జాతకాన్ని వెల్లడించడం గురించి వేణుస్వామి రియాక్ట్ అయ్యారు.
నాతో నీ జాతకం గురించి చెప్పించిన వ్యక్తుల, సంస్థల తరపున నేను క్షమాపణలు చెబుతున్నానని వేణుస్వామి అన్నారు.నీ విషయంలో జాలి లేకుండా రాక్షస భావజాలంతో వ్యవహరించిన తెలుగు సమాజం తరపున నిన్ను క్షమించమని కోరుతున్నానని వేణుస్వామి పేర్కొన్నారు.
సమంతకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని నీకు ధైర్యం చెప్పడం తప్ప నేనేం చేయలేనని వేణుస్వామి అన్నారు.
సమంతకు సింపతీ వస్తుందని ప్రజలకు సమంతపై జాలి కలుగుతుందని ఆ సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయడం కోసం చేసిన కుట్రలో భాగంగా నన్ను తెరపైకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల జాతకాలను( Horoscopes of celebrities ) వేణుస్వామి తప్పుగా చెబుతున్నాడని ఆరోపణలు చేస్తూ సమంతను పూర్తిగా చర్చలో లేకుండా పక్కకు తప్పించారని వేణుస్వామి అన్నారు.
ఒక స్త్రీకి జరిగిన నష్టం గురించి చర్చ జరగకుండా ఉండటానికి నన్ను తెలివిగా తెరపైకి తెచ్చారని వేణుస్వామి కామెంట్లు చేశారు.వేణుస్వామి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.వేణుస్వామి చేసిన కామెంట్ల విషయంలో సమంత నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సమంత భారీ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.సమంత మార్కెట్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.