వాళ్లకు దూరంగా ఉండండి.. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు ఇండియన్ కాన్సులేట్ హెచ్చరిక

అమెరికా ( America )వెళ్లి లక్షలాది రూపాయలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు.

అన్ని దేశాలకు చెందిన వారు అమెరికా వెళ్లేందుకు పోటీపడుతుండటంతో ఆ దేశ వీసా పొందడం కష్టమైంది.

దీంతో దొడ్డిదారిన వెళ్లే వారి సంఖ్య ఇటీవల పెరిగింది.సరిహద్దులు దాటుతూ చేసే సాహసాలు వారి ప్రాణాల మీదకొస్తున్నాయి.

లేదంటే బోర్డర్ సెక్యూరిటీ ఏజెంట్లకు ( Border Security Agents )చిక్కి జైళ్లలో మగ్గడం నిత్యకృత్యమైంది.

దీనికి ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసాలు అదనం.అమెరికాకు అక్రమ మార్గాల్లో చేరవేరుస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ కొన్ని గ్యాంగ్‌లు జేబులు నింపుకుంటున్నాయి.

"""/" / అయితే అమెరికాకు వెళ్లిన వారే కాదు.ఏళ్లుగా అగ్రరాజ్యంలో నివసిస్తూ స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ట్రావెల్ ఏజెంట్ల ఉచ్చులో పడి జేబులు గుల్లచేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ( Indian Consulate In New York )కీలక అడ్వైజరీ జారీ చేసింది.

అమెరికాలోని మోసపూరిత ట్రావెల్ ఏంజెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని .కాన్సుల్ జనరల్ బినయ్ ప్రధాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అమెరికాలోని ఇండియన్ మిషన్స్ నుంచి పొందే సేవలకు గాను కొందరు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కాన్సుల్ తెలిపింది.

"""/" / ప్రధానంగా ఓవర్సీస్ సిటిజన్‌ ఆఫ్ ఇండియా( Overseas Citizen Of India ) (ఓసీఐ) కార్డులు, వీసాలు, పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారని హెచ్చరించింది.

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం రాయబార కార్యాలయం నామమాత్రంగా 17 డాలర్లు వసూలు చేస్తుండగా.

ఏజెంట్లు మాత్రం 450 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారని తెలిపింది.అలాగే ఈ తరహా సేవలకు గాను నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారని.

ఈ సమాచారాన్ని దరఖాస్తుదారులకు సైతం తెలియజేయడం లేదని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.వీటి వల్ల బాధితులు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల మోసపూరిత ట్రావెల్ ఏజెంట్లకు దూరంగా ఉండాలని కాన్సుల్ కార్యాలయం హెచ్చరించింది.

ఆ హీరోయిన్‌కి మూడుసార్లు ఛాన్స్ ఇచ్చిన బన్నీ.. ఎందుకంత ప్రేమ..?